Bindu Madhavi: డ్రెస్సింగ్‌పై ట్రోల్స్‌.. బిందు మాధవి ఘాటు రిప్లై

తన డ్రెస్సింగ్‌ గురించి సోషల్‌మీడియాలో వస్తోన్న ట్రోల్స్‌పై ఘాటుగా స్పందించారు నటి బిందుమాధవి (Bindu Madhavi). వేసుకున్న దుస్తులను బట్టి ఇచ్చే గౌరవం తనకు వద్దని అన్నారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు నెట్టింట అందరి దృష్టిని...

Updated : 03 Aug 2022 12:53 IST

హైదరాబాద్‌: తన డ్రెస్సింగ్‌ గురించి సోషల్‌మీడియాలో వస్తోన్న ట్రోల్స్‌పై ఘాటుగా స్పందించారు నటి బిందుమాధవి (Bindu Madhavi). వేసుకున్న దుస్తులను బట్టి ఇచ్చే గౌరవం తనకు వద్దని అన్నారు. పలువురు నెటిజన్లు ఆమె వ్యాఖ్యలను మెచ్చుకుంటూ ఉండగా.. మరికొంతమంది మాత్రం ‘‘మిమ్మల్ని ఇలాంటి ఫ్యాషన్‌ దుస్తుల్లో చూడలేకపోతున్నాం’’ అంటూ తప్పుపడుతున్నారు.

‘‘అవకాయ్‌ బిర్యానీ’’తో నటిగా పరిచయమైన తెలుగమ్మాయి బిందుమాధవి. ఆ సినిమా విజయం తర్వాత తెలుగు, తమిళంలో ఆమె పలు సినిమాలు చేశారు. ఇటీవల ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో ప్రసారమైన ‘బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌’ రియాల్టీ షోలో పాల్గొని విజేతగా నిలిచారు. ఆ షోలో ఉన్నప్పుడు తనని వేలెత్తి చూపిన వారందరికీ గట్టిగా సమాధానమిచ్చి ‘ఆడపులి’గా పేరు తెచ్చుకున్నారు. ఇదిలా ఉండగా, ప్రస్తుతం పలు షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఆమె.. తన లేటెస్ట్‌ ఫొటోషూట్‌కు సంబంధించిన పలు ఫొటోలను ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేశారు. వాటిని చూసిన పలువురు నెటిజన్లు ఆమెపై విమర్శలు కురిపించారు. ‘‘బిగ్‌బాస్‌లో ఉన్నప్పుడు ఈమెను చూస్తే నాకెంతో ఆనందంగా అనిపించేది. హౌస్‌లో ఉన్న వాళ్లందరూ ఎక్స్‌పోజ్‌ చేసేలా దుస్తులు వేసుకున్నప్పటికీ ఈమె మాత్రం సంప్రదాయ దుస్తుల్లోనే ఉండేవారు. కానీ, ఇప్పుడు ఈ ఫొటోలు చూసిన తర్వాత ఈమెపై ఉన్న గౌరవం పూర్తిగా పోయింది’’ అని ఓ నెటిజన్‌ అసహనం వ్యక్తం చేశారు. దీనిపై బిందు తనదైన శైలిలో స్పందించారు. ‘‘ఎదుటివాళ్లు ధరించే దుస్తులు చూసి మీరు మర్యాద, గౌరవం ఇవ్వాలనుకుంటే.. నాకు అలాంటి మర్యాద అస్సలు అవసరం లేదు’’ అని రిప్లై ఇచ్చారు.

మరిన్ని చిత్రాల కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని