Vijayanand: ‘విజయానంద్‌’ ప్రయాణం

సామాన్యుడిగా జీవితాన్ని ప్రారంభించి.. వీఆర్‌ఎల్‌ అనే పెద్ద లాజిస్టిక్‌ కంపెనీ స్థాపించి ఎందరికో ఆదర్శప్రాయుడిగా నిలిచారు విజయ్‌ శంకేశ్వర్‌. ఇప్పుడాయన జీవిత కథ ‘విజయానంద్‌’ పేరుతో తెరపైకి వస్తోంది.

Updated : 03 Aug 2022 08:24 IST

సామాన్యుడిగా జీవితాన్ని ప్రారంభించి.. వీఆర్‌ఎల్‌ అనే పెద్ద లాజిస్టిక్‌ కంపెనీ స్థాపించి ఎందరికో ఆదర్శప్రాయుడిగా నిలిచారు విజయ్‌ శంకేశ్వర్‌ (Vijay Sankeshwar). ఇప్పుడాయన జీవిత కథ ‘విజయానంద్‌’ (Vijayanand) పేరుతో తెరపైకి వస్తోంది. టైటిల్‌ పాత్రలో నిహాల్‌ (Nihal) నటించారు. రిషికా శర్మ తెరకెక్కించారు. ఆనంద్‌ శంకేశ్వర్‌ నిర్మాత. అనంత్‌ నాగ్‌, వినయ ప్రసాద్‌, వి.రవిచంద్రన్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్ర టీజర్‌ను మంగళవారం విడుదల చేశారు. విజయానంద్‌ తన తండ్రిపై ఆధారపడకుండా.. సొంత తెలివితేటలతో లారీల వ్యాపారంలోకి ఎలా ప్రవేశించారు, అటు నుంచి క్రమంగా పైకి ఎలా ఎదిగారు, ఈ క్రమంలో ఆయనకు అండగా నిలిచిందెవరు? అనే విషయాల్ని టీజర్‌లో ఆసక్తికరంగా చూపించారు. ఈ సినిమా త్వరలో తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం: గోపీ సుందర్‌, ఛాయాగ్రహణం: కీర్తన్‌.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని