‘మంచు’ వారి ఇంట్లో బర్త్‌డే వేడుకలు

ప్రముఖ నటుడు మంచు మోహన్‌ బాబు ఇంట్లో పుట్టినరోజు వేడుకలు వైభవంగా జరిగాయి. మంచు విష్ణు-విరోనికా దంపతుల నాలుగో సంతానం ఐరా విద్యా బర్త్‌డే సెలబ్రెషన్స్‌ హైదరాబాద్‌లో నిర్వహించారు.

Updated : 10 Aug 2020 07:14 IST

హైదరాబాద్‌: ప్రముఖ నటుడు మంచు మోహన్‌ బాబు ఇంట్లో పుట్టినరోజు వేడుకలు వైభవంగా జరిగాయి. మంచు విష్ణు-విరోనికా దంపతుల నాలుగో సంతానం ఐరా విద్యా బర్త్‌డే సెలబ్రెషన్స్‌ హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ వేడుకలో విష్ణు కుమార్తెలు అరియాన, వివియాన.. కూమారుడు అవ్రామ్‌ భక్త ఆకర్షణగా నిలిచారు. వేడుకల సందర్భంగా మంచు కుటుంబం ఫొటో షూట్‌ నిర్వహించింది. అందులో విష్ణు సోదరి లక్ష్మీ మంచు, మోహన్‌బాబు, మంచు మనోజ్‌  కూడా పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను మంచు విష్ణు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.  లేత గులాబీ రంగు థీమ్‌తో ఈ ఫొటో షూట్‌ నిర్వహించారు. మంచు మహిళలు కుర్చీల్లో కూర్చుని ఉండగా, మోహన్‌బాబు, విష్ణు, మనోజ్‌ వెనుక నిల్చుని ఫొటోలకు పోజులిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని