అల్లు అర్జున్‌ తగ్గేదే లే - చిరంజీవి

‘పుష్పరాజ్‌గా అల్లు అర్జున్‌ తగ్గేదే లే!’ అని అంటున్నారు అగ్రకథానాయకుడు చిరంజీవి. గురువారం అల్లు అర్జున్‌ పుట్టినరోజు సందర్భంగా విషెస్‌ తెలుపుతూ చిరు ఓ ట్వీట్‌ పెట్టారు. బుధవారం విడుదలైన...

Updated : 08 Apr 2021 10:55 IST

ఐకాన్‌స్టార్‌కు పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ

హైదరాబాద్‌: ‘పుష్పరాజ్‌గా అల్లు అర్జున్‌ తగ్గేదే లే!’ అని అంటున్నారు అగ్రకథానాయకుడు చిరంజీవి. గురువారం అల్లు అర్జున్‌ పుట్టినరోజు సందర్భంగా విషెస్‌ తెలుపుతూ చిరు ఓ ట్వీట్‌ చేశారు. బుధవారం విడుదలైన ‘పుష్ప’ టీజర్‌ని తాను చూశానని చిరు తెలిపారు. టీజర్‌ ఊరమాస్‌ లెవల్‌లో ఉందని ఆయన పేర్కొన్నారు. మరోవైపు పలువురు సినీ ప్రముఖులు సైతం బన్నీకి బర్త్‌డే విషెస్‌ తెలిపారు.

‘‘పుష్ప’ టీజర్ చూశాను. వాస్తవానికి దగ్గరగా ఊరమాస్‌గా ఉంది. పుష్పరాజ్‌గా అల్లు అర్జున్‌ తగ్గేదే లే! నా ప్రియమైన బన్నీకి పుట్టినరోజు శుభాకాంక్షలు’ - చిరంజీవి

‘హ్యాపీ బర్త్‌డే అల్లు అర్జున్‌!! అదృష్టం నిన్ను వరించాలని, సంతోషం, విజయం ఎప్పుడూ నీతో ఉండాలని కోరుకుంటున్నాను. ‘పుష్ప’ టీజర్‌ ఎంతో అద్భుతంగా ఉంది. సినిమా కోసం ఎదురుచూస్తున్నా’ - రవితేజ

‘సినిమా పట్ల మీకున్న అభిరుచి, నిబద్ధత, ప్రేమే మిమ్మల్ని ఐకాన్‌స్టార్‌గా మార్చాయి. మీరు ఇలాగే ఎంతోమందిలో స్ఫూర్తినింపాలని ఆశిస్తున్నా. పుష్ప టీజర్‌ ఎంతో బాగుంది. హ్యాపీ బర్త్‌డే ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్’ - శ్రీనువైట్ల

‘హ్యాపీ బర్త్‌డే బగ్సీ! ఈ ఏడాదంతా నీకు అత్యద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నాను.’ - కాజల్‌ అగర్వాల్‌

‘ఐకాన్‌స్టార్‌ బన్నీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. పుష్పరాజ్‌ వీడియో బాగుంది. సినిమా పట్ల మీకున్న అభిరుచి, అభిమానం.. మీకు బ్లాక్‌బస్టర్‌ విజయాలు అందించాలని ఆశిస్తున్నా.’ - గోపీచంద్‌ మలినేని

‘పుష్ప ఎంతో వైల్డ్‌గా ఉంది!! హీరోగా మరెంతో ఎత్తుకు ఎదగాలని ఆశిస్తున్నా. హ్యాపీ బర్త్‌డే బావ’ - నవదీప్‌

‘ఐకాన్‌స్టార్‌ అల్లుఅర్జున్‌ సర్‌.. పుష్పరాజ్‌ టీజర్‌ అదిరిపోయింది. ‘పుష్ప’ టీమ్‌లో భాగమైనందుకు సంతోషం, గర్వంగా ఉంది. ఆగస్టు 13 కోసం ఎంతో ఆతృతతో ఎదురుచూస్తున్నా’- సునీల్‌

‘అల్లు అర్జున్‌కి జన్మదిన శుభాకాంక్షలు. సినిమా పట్ల మీకున్న అంకితభావం, శ్రమించే గుణం ఎంతోమందికి ప్రేరణ. ఐకాన్‌ స్టార్‌గా ‘పుష్ప’తో నువ్వు మరింత ప్రకాశించాలని  ఆశిస్తున్నాను. ఆల్‌ ది బెస్ట్‌’ - బాబీ


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని