Arjun kapoor: అర్జున్.. ప్రజల్ని బెదిరించకు..నటనపై దృష్టి పెట్టు: భాజపా మంత్రి సలహా
బీటౌన్ లో రగులుతున్న ‘బాయ్‌కాట్ లాల్ సింగ్ చడ్డా’(boycott Laal Singh Chaddha) వివాదం ఇప్పట్లో పరిష్కారం అయ్యేలా కనిపించట్లేదు. ఈ వ్యవహారంపై ఏ హీరో మాట్లాడినా..
ఇంటర్నెట్ డెస్క్: బీటౌన్ లో రగులుతున్న ‘బాయ్‌కాట్ లాల్ సింగ్ చడ్డా’(boycott Laal Singh Chaddha) వివాదం ఇప్పట్లో పరిష్కారమయ్యేలా కనిపించట్లేదు. ఈ వ్యవహారంపై ఏ హీరో మాట్లాడినా వారి సినిమాలకు సైతం కొందరు సోషల్ మీడియాలో బాయ్‌కాట్ హ్యాష్‌ట్యాగ్‌ను జత చేస్తున్నారు. ఇటీవల ఈ వివాదంపై స్పందించిన హృతిక్ రోషన్(Hrithik Roshan)ను హెచ్చరించిన నెటిజన్లు తాజాగా యువనటుడు అర్జున్ కపూర్(Arjun Kapoor)ని ట్రోల్ చేస్తున్నారు. ‘బాయ్‌కట్ లాల్ సింగ్ చడ్డా’ పై ఈ యువనటుడు స్పందిస్తూ ‘ఈ వ్యవహారంపై బాలీవుడ్ అంతా కలిసి చర్యలు తీసుకోవాలి’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ఇప్పుడు విమర్శలు పెరుగుతున్నాయి. మధ్యప్రదేశ్ భాజపా మంత్రి నరోత్తమ్ మిశ్రా (Narottam Mishra) ఈ విషయంపై ట్విటర్లో స్పందిస్తూ ‘నటుడు అర్జున్ కపూర్ ప్రజలను బెదిరించడం మంచి విషయం కాదనిపిస్తోంది. ముందు నువ్వు నటనపై దృష్టి పెట్టు. ఎందుకు హిందూయిజాన్ని టార్గెట్ చేసే గ్యాంగ్‌కి సపోర్ట్ చేస్తున్నావ్’ అంటూ పోస్ట్ చేశారు. ‘అర్జున్.. నీ సినిమాలకంతా సీన్ లేదు. ఎందుకంత ఫీలవుతున్నావ్’, ‘మిస్టర్ ఎక్స్ప్రెషన్! ముందు నటన నేర్చుకో’, ‘బాయ్‌కాట్ చేయడానికి నీ సినిమాలు కూడా ఏమి లేవు’, ‘ఇలాగైనా నీ సినిమాలను పబ్లిసిటి చేసుకుందామనా’ అంటూ కొందరు నెటిజన్లు అర్జున్ కపూర్‌పై విరుచుకుపడుతున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల విడుదలైన అర్జున్ కపూర్ చిత్రం ‘ఏక్ విలన్ రిటర్న్స్’(Ek Villain Returns) ఆశించిన విజయాన్ని సాధించలేదు. సీనియర్ నటులు నసీరుద్దీన్ షా, టబులతో కలిసి నటించిన ‘కుత్తే’(Kuttey) విడుదల తేది ఇంకా ప్రకటించలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
NDA: ఎన్డీఏ ‘మహా’ వ్యూహం.. ఉద్ధవ్‌కు చెక్ పెట్టేందుకు రంగంలోకి రాజ్..!
-
Stock market: భారీ నష్టాల్లో సూచీలు.. సెన్సెక్స్ 700 పాయింట్లు డౌన్
-
India- China: ఎన్నిసార్లు వాదించినా వాస్తవాలు మారవు.. చైనాకు భారత్ కౌంటర్
-
CAA: సీఏఏపై స్టే కోరుతూ పిటిషన్లు.. కేంద్రానికి మూడు వారాల గడువిచ్చిన సుప్రీం
-
Sita Soren: జేఎంఎంకు షాక్..! భాజపాలోకి శిబూ సోరెన్ పెద్ద కోడలు
-
Mumbai Indians: హార్దిక్.. అంత వీజీ కాదు