Updated : 22 May 2022 06:50 IST

Black: థ్రిల్‌ చేసే ‘బ్లాక్‌’

ఆది సాయికుమార్‌ హీరోగా జి.బి.కృష్ణ తెర కెక్కించిన చిత్రం ‘బ్లాక్‌’. మహంకాళి దివాకర్‌ నిర్మించారు. దర్శన బానిక్‌ కథానాయిక. కౌషల్‌ మందా, ఆమని, పృథ్విరాజ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా మే 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే శనివారం హైదరాబాద్‌లో సాయికుమార్‌ ట్రైలర్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ట్రైలర్‌ చూశా. ఆసక్తికరంగా ఉంది.   28న ఎన్టీఆర్‌ పుట్టినరోజు. అంత గొప్ప రోజు నా కొడుకు చిత్రం విడుదల కావడం ఆనందంగా  ఉంద’’న్నారు. ‘‘దర్శకుడు మంచి కథ సిద్ధం చేశారు. ప్రేక్షకులు చాలా థ్రిల్‌ ఫీలవుతారు.   కచ్చితంగా అందరికీ నచ్చుతుంది’’ అన్నారు హీరో ఆది సాయికుమార్‌. చిత్ర దర్శకుడు మాట్లాడుతూ.. ‘‘ఇది చాలా విభిన్నమైన కథ. ఆది పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. మా చిత్రాన్ని అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నా’’ అన్నారు. ఈ కార్యక్రమంలో సతీష్‌ ముత్యాల, సురేష్‌ బొబ్బిలి, కె.వి.రమణ   తదితరులు పాల్గొన్నారు.


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని