Bloody mary: ‘బ్లడీ మేరీ’ మేకింగ్ వీడియో చూశారా..

 ‘మెంటల్‌మదిలో’ సినిమాలో స్వేచ్ఛగా తెలుగు తెరకు పరిచయమై ‘అల వైకుంఠపురము’ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న నటి నివేదా పేతురాజ్‌.

Published : 08 Apr 2022 13:29 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘మెంటల్‌మదిలో’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమై ‘అల వైకుంఠపురము’ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న నటి నివేదా పేతురాజ్‌. ప్రస్తుతం ఈ హీరోయిన్‌ ప్రధాన పాత్రలో నటించిన ‘బ్లడీ మేరీ’ ఈ నెల 15న ఆహా వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా మేకింగ్‌ వీడియోను చిత్రబృందం విడుదల చేసింది. దర్శకుడు చందు ముండేటి పూర్తి క్రైం థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో నివేదా అంధురాలి పాత్రలో నటిస్తోంది. కిరిటీ దామరాజ్‌, బ్రహ్మాజీ, అజయ్‌ కీలక పాత్రల్లో పోషిస్తోన్న ఈ మూవీని పీపుల్‌ మీడియా  ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. కార్తీక్‌ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ అందిస్తుండగా కాలభైరవ సంగీతం సమకూరుస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని