అమితాబ్ ‘ప్రతీక్ష’ బంగ్లా గోడ పడగొట్టనున్న బీఎంసీ

ట్రాఫిక్ సమస్య కారణంగా బంగ్లా గోడ కూల్చివేయాలని బీఎంసీ నిర్ణయం

Published : 06 Jul 2021 01:04 IST

ముంబయి: బాలీవుడ్‌ నటుడు, బిగ్‌బి అమితాబ్‌ బచ్చన్‌ బంగ్లా ‘ప్రతీక్ష’కు ప్రత్యేకమైన క్రేజ్‌ ఉంది. ముంబయికి విచ్చేసే ఆయన అభిమానులు ప్రతీక్ష గేటు ఎదురుగా ఫొటోలు దిగుతుంటారు. అంతేకాదు.. అమితాబ్‌ తల్లితండ్రులు హరివంశ్‌ బచ్చన్‌, తేజీ బచ్చన్‌ ఇందులోనే నివసించే వారట.. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న బంగ్లా గోడను కూల్చివేస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపించింది బృహన్ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్ (బీఎంసీ). ట్రాఫిక్‌ రద్దీ కారణంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ప్రతీక్ష బంగ్లా గోడ కూల్చివేయాలని బీఎంసీ నిర్ణయించింది. తద్వారా రోడ్డు విస్తరణ జరిగి ట్రాఫిక్‌ సమస్య తీరనుందని పేర్కొంది. ఇందుకు సంబంధించిన నోటీసులను బీఎంసీ అధికారులు అమితాబ్‌కు నాలుగేళ్ల క్రితమే పంపించారని, అదే ప్రాంతంలో బాలీవుడ్‌ దర్శకుడు రాజ్‌కుమార్‌ హిరాణీకి సైతం స్థలాలు ఉన్నట్లు గుర్తించారు. గతంలోనే ప్రతీక్షకు దగ్గరలో ఉండే గోడ కూల్చగా, బిగ్‌బి బంగ్లాని మాత్రం కూల్చకుండా వదిలేశారు. తాజాగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ఠాక్రే తనయుడు, పర్యాటక, పర్యావరణశాఖ మంత్రి ఆదిత్యఠాక్రే ట్రాఫిక్‌ రద్దీ కారణంగా రోడ్ల విస్తరణకు సంబంధించి నిర్ణయం తీసుకున్నారని, ఇందులో భాగంగానే ఇలా చేస్తున్నట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని