Cinema news: బి.ఎన్‌.రెడ్డి కి ఇదేం పోయేకాలం?...అన్నారట

‘రాజమకుటం’ విడుదలైన తర్వాత దర్శకుడు బి.ఎన్‌.రెడ్డి, ఆంధ్రా పర్యటనలో భాగంగా ప్రేక్షకులు ఏమనుకుంటున్నారో చూడాలనిపించిందట.

Published : 01 Jan 2023 15:10 IST

సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకుల స్పందన ఎలా ఉందో ప్రత్యక్షంగా చూసేందుకు నిర్మాతలు, దర్శకులు థియేటర్లకు వెళ్లడం ఆ రోజుల్లోనూ ఉండేది. వాహినీ వారి ‘రాజమకుటం’ విడుదలైన తర్వాత దర్శకుడు బి.ఎన్‌.రెడ్డి, ఆంధ్రా పర్యటనలో భాగంగా విజయవాడలోని వాహినీ సంస్థ బ్రాంచి మేనేజర్‌ సుబ్రహ్మణ్యం (దర్శకుడు కె.విశ్వనాథ్‌ తండ్రి)తో కలసి ఏలూరు వెళ్లారట. అక్కడ ఓ థియేటర్‌కు వెళ్లి బాల్కనీలో కూర్చొని ప్రేక్షకుల స్పందన గమనించ సాగారు. మధ్యలో ఆయనకు దిగువ తరగతి వారు ఏమనుకుంటున్నారో చూడాలనిపించింది. బాల్కనీ దిగి, బెంచ్‌ క్లాస్‌కు వెళ్లి ప్రేక్షకుల మధ్య కూర్చున్నారట.

పోరాట సన్నివేశం రాగానే ఓ ప్రేక్షకుడు- ‘‘ఈ బి.ఎన్‌.రెడ్డికి ఇదేం పోయేకాలం? ఈయన కూడా ఇలాంటివి మొదలెట్టాడు?’’ అన్నాడట. పక్కనే ఉన్న బి.ఎన్‌. సిగ్గుతో తలెత్తుకోలేక హాలు బయటకు వచ్చారట. ‘ఇన్నేళ్లు శ్రమపడి సంపాదించుకున్న పేరు, ఈ ఒక్క సినిమాతో మట్టిలో కలిసిపోయింది’ అని బాధపడుతూ, విజయనగరం వరకు వెళ్లి ప్రేక్షకుల నాడిని తెలుసుకోవాలనుకున్న టూర్‌ ప్రోగ్రాంను రద్దు చేసుకుని మర్నాడే మద్రాసు మెయిల్‌ ఎక్కారట.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని