Bobby Deol: దాని నుంచి బయటకు రావాలనుకుంటున్నా: బాబీ దేవోల్‌

మనల్ని మనం నమ్మడం ప్రారంభిస్తే మార్పు స్పష్టంగా కనిపిస్తుందని బాలీవుడ్‌ నటుడు బాబీ దేవోల్‌ అన్నారు.

Published : 18 Jun 2024 15:36 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ‘యానిమల్‌’ సినిమాతో అన్ని భాషల ప్రేక్షకులకు దగ్గరయ్యారు బాలీవుడ్‌ నటుడు బాబీ దేవోల్‌ (Bobby Deol). ప్రస్తుతం వరుస ఆఫర్లు అందుకుంటూ బిజీగా మారారు. తాజాగా ఆయన ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ బాలీవుడ్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అప్రమత్తంగా లేకపోతే ఇక్కడ అందరూ సలహాలిస్తుంటారని పేర్కొన్నారు.

‘సినిమాల ఎంపికలో కొన్నిసార్లు మనం సరైన నిర్ణయాలు తీసుకోలేం. మరికొన్నిసార్లు దర్శక, నిర్మాతల వల్ల కూడా అలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. సవాళ్లను స్వీకరించకూడదు అనుకున్నప్పుడు ఇలా జరుగుతుంది. కంఫర్టు జోన్‌ నుంచి బయటకు వచ్చి పాత్రలను ఎంపిక చేసుకోవాలి. నేను దానినుంచి బయటకు వచ్చి నటించాలని నిర్ణయించుకున్నా. ఏ పాత్రనైనా నమ్మకంతో చేస్తాను. మనం సవాళ్లను ఎదుర్కోకూడదనుకుంటే మన చుట్టూ ఉండే వాళ్లు సలహాలిస్తుంటారు. ఇండస్ట్రీలో వచ్చే మార్పును ముందే గమనించి దానికి తగినట్లు సినిమాలను ఎంపిక చేసుకోవాలి. మనల్ని మనం నమ్మడం ప్రారంభిస్తే మార్పు స్పష్టంగా కనిపిస్తుంది’ అని చెప్పారు.

రిలీజ్‌కు ముందే ‘కల్కి’ హవా.. తొలి ఇండియన్ సినిమాగా రికార్డు

పస్తుతం బాబీ దేవోల్‌ హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ వరుస అవకాశాలు అందుకుంటున్నారు. బాలకృష్ణ హీరోగా బాబీ తెరకెక్కించనున్న  (#NBK109)లో నటిస్తున్నారు. దీనికోసం బాబీ ఇప్పటికే తన లుక్‌ మార్చుకున్నట్లు తెలుస్తోంది. అలాగే సూర్య హీరోగా రూపొందుతోన్న  ‘కంగువా’లో కనిపించనున్నారు. ఇందులో ఆయన భిన్నమైన ఆహార్యంలో కనిపించనున్నారు. త్వరలోనే ఇది ప్రేక్షకుల ముందుకురానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని