Akshay Kumar: ‘బెల్ బాటమ్’ విడుదల ఖరారు
ఎప్పుడెప్పుడా అని బాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న చిత్రం బెల్ బాటమ్. అక్షయ్ కుమార్ హీరోగా రంజిత్ ఎం. తివారీ తెరకెక్కించిన చిత్రమిది.
ఇంటర్నెట్ డెస్క్: ఎప్పుడెప్పుడా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తోన్న చిత్రం ‘బెల్ బాటమ్’. అక్షయ్ కుమార్ హీరోగా రంజిత్ ఎం.తివారీ తెరకెక్కించిన చిత్రమిది. కొవిడ్ సెకండ్ వేవ్ దృష్ట్యా థియేటర్లు తాత్కాలికంగా మూతపడటంతో ఈ చిత్రం డిజిటల్ మాధ్యమం వేదికగా విడుదలవుతుందంటూ ప్రచారం సాగింది. ప్రముఖ ఓటీటీలో ఈ సినిమా ప్రసారం కానుందంటూ కథనాలు వెలువడ్డాయి. తాజాగా వాటన్నింటికీ సమాధానం ఇచ్చాడు అక్షయ్. ఈ చిత్రాన్ని థియేటర్లలోనే విడుదల చేస్తున్నట్టు సామాజిక మాధ్యమాల వేదికగా ప్రకటించాడు. జులై 27న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ చిత్రం. వాణీ కపూర్, హ్యూమా ఖురేషీ, లారా దత్తా తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. పూజ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం 2021 ఏప్రిల్ 2న విడుదల కావాల్సి ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ