Akshay Kumar: సౌత్‌, నార్త్‌ కాదు మనది ఒకే ఇండస్ట్రీ: అక్షయ్‌ కుమార్‌

సినిమాల విషయంలో సౌత్‌, నార్త్‌ అనే విభజన తనకు నచ్చదని, పాన్‌ ఇండియా అనే పదాన్ని నమ్మనని బాలీవుడ్‌ ప్రముఖ నటుడు అక్షయ్‌ కుమార్‌ అన్నారు. తాను నటించిన ‘పృథ్వీరాజ్‌’ సినిమా ప్రచారంలో భాగంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన అక్షయ్‌ ఈ విషయమై మాట్లాడారు.

Published : 23 May 2022 01:43 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సినిమాల విషయంలో సౌత్‌, నార్త్‌ అనే విభజన తనకు నచ్చదని, పాన్‌ ఇండియా అనే పదాన్ని నమ్మనని బాలీవుడ్‌ ప్రముఖ నటుడు అక్షయ్‌ కుమార్‌ అన్నారు. తాను నటించిన ‘పృథ్వీరాజ్‌’ సినిమా ప్రచారంలో భాగంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన అక్షయ్‌ ఈ విషయమై మాట్లాడారు. హిందీ చిత్ర పరిశ్రమపై ఇటీవల కన్నడ నటుడు కిచ్చా సుదీప్‌ వ్యాఖ్యలు చేయగా దానికి హిందీ నటుడు అజయ్‌దేవ్‌గణ్‌ స్పందించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తీవ్ర స్థాయిలో చర్చ సాగింది. అది భారతీయ చిత్ర పరిశ్రమలో హాట్‌ టాపిక్‌గా మారింది. 

దీని గురించి మీరేమంటారు? అని విలేకరి అడగ్గా ‘‘ఈ విభజన నాకు నచ్చదు. ఎవరైనా సౌత్‌ ఇండస్ట్రీ, నార్త్‌ ఇండస్ట్రీ అంటుంటే అస్సలు సహించను. మనమంతా ఒకే ఇండస్ట్రీకి చెందినవారం. ఇకపై ఇలాంటి ప్రశ్నలు అడగకుండా ఉంటారని ఆశిస్తున్నా’’ అని అక్షయ్‌ సమాధానమిచ్చారు. ‘‘బ్రిటిషర్లు ఇక్కడకు వచ్చి మనల్ని విభిజించి.. మనపైనే దండెత్తి పరిపాలించారు. ఈ ముఖ్య విషయాన్ని ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి. వాటి నుంచి మనం పాఠాలను నేర్చుకోవాలి. మనమంతా ఒక్కటేనని ఎప్పుడైతే అనుకుంటామో ఆరోజు మరింత అద్భుతంగా పని చేయగలం’’ అని ఆశాభావం వ్యక్తం చేశారు. పీరియాడికల్‌ చిత్రంగా రూపొందిన ‘పృథ్వీరాజ్‌’ చిత్రాన్ని దర్శకుడు చంద్రప్రకాశ్‌ ద్వివేది తెరకెక్కించారు. మిస్‌ యూనివర్స్‌- 2017 విజేత మానుషి చిల్లర్‌ కథానాయికగా పరిచయమవుతున్న ఈ సినిమా జూన్‌ 3న ప్రేక్షకుల ముందుకురానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని