Sanjay Dutt: ‘కేజీయఫ్’లో విలన్.. వాస్తవంలో హీరో!
కొన్ని కీలక పాత్రలు ఎవరి దగ్గరకు చేరాలో వారిని వెతుక్కుంటూ వెళ్తాయి. అలా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే వారు కొందరైతే, వివిధ కారణాల వల్ల వదులుకునేవారు మరికొందరు. ‘కేజీయఫ్ 2’లోని ప్రధాన విలన్ పాత్ర ‘అధీరా’ బాలీవుడ్ ప్రముఖ నటుడు సంజయ్ దత్‌ను కోరింది.
ఇంటర్నెట్ డెస్క్: కొన్ని కీలక పాత్రలు ఎవరి దగ్గరకు చేరాలో వారినే వెతుక్కుంటూ వెళ్తాయి. అలా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే వారు కొందరైతే, వివిధ కారణాల వల్ల వదులుకునేవారు మరికొందరు. ‘కేజీయఫ్ 2’లోని ప్రధాన విలన్ పాత్ర ‘అధీరా’ బాలీవుడ్ ప్రముఖ నటుడు సంజయ్ దత్‌ను కోరుకుంది. చాలా ఆసక్తికర క్యారెక్టర్ కావడంతో ఆయన ఓకే చెప్పారు. ఇందులో విశేషం ఏముందని అనుకుంటున్నారా? దాని వెనక విశేషం కాదు ఓ పోరాటమే దాగుంది.
క్యాన్సర్‌ను జయించి..
సంజయ్‌కు గతంలో ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చిన సంగతి తెలిసిందే. 60 (సుమారు) ఏళ్ల వయసులో ఆ మహమ్మారి వ్యాధిపై అలుపెరగని పోరాటం చేసి జయించారు. కొన్నాళ్లు విశ్రాంతి అనంతరం, కోలుకుని మళ్లీ సినిమాల్లోకి వచ్చే క్రమంలో ‘కేజీయఫ్ ఛాప్టర్ 2’సహా మరికొన్ని కథలు ఆయన దగ్గరకు చేరాయి. ‘విలన్ పాత్ర.. పోరాటాలు చేయాలి. ఇప్పుడు ఇలాంటి పాత్రలు అవసరమా’ అనే సందేహాలు పెట్టుకోకుండా తన మార్క్ వైవిధ్య నటనను ప్రేక్షకులకు మరోసారి చూపించేందుకు అధీరా పాత్రకు ఆయన సై అన్నారు. ఈ భయంకర వ్యాధిపై గెలిచిన తర్వాత ఆయన నటించిన తొలి చిత్రమిదే. కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నా.. చిన్న చిన్న సమస్యలు ఎదురవడం సహజం. వాటిని అధిమగమిస్తూ ఎండావానా, పగలురాత్రీ లెక్క చేయకుండా నటించిన సంజయ్ చిత్ర బృందాన్ని ఆశ్యర్యానికి గురిచేశారు. మరో విశేషం ఏంటంటే సెట్స్‌లో అడుగుపెట్టిన తొలిరోజే పవర్ఫుల్ యాక్షన్ సన్నివేశాల్లో ఆయన పాల్గొన్నారు. సంజయ్ ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని దర్శకుడు ప్రశాంత్ నీల్ సంబంధిత సన్నివేశాలు గ్రీన్‌మ్యాట్‌పై చిత్రీకరించాలని ప్రతిపాదించినా వినకుండా సహజంగానే నటించారు. ఆ సినిమా నటీనటులకు, సాంకేతిక బృందానికి స్ఫూర్తిగా నిలిచారు. ‘రియల్ హీరో’ అనిపించుకున్నారు.
పోరాట యోధుడిగా..
సంజయ్ విషయంలో ‘‘ఆశ క్యాన్సర్ ఉన్నవాడిని కూడా బతికిస్తుంది.. భయం అల్సర్ ఉన్నవాడిని కూడా చంపేస్తుంది’’ అనే సినిమా డైలాగ్ సరిగ్గా సరిపోతుంది. వ్యాధి నాలుగో దశకు చేరినా ఏమాత్రం ఒత్తిడికి గురవకుండా తనను తాను నమ్మి ముందుకుసాగారు. ఓవైపు చికిత్స పొందుతూనే ఫిట్నెస్ విషయంలో జాగ్రత్త తీసుకున్నారు. ఊపిరితిత్తులకు సంబంధించిన చిన్న చిన్న వ్యాయామాలు చేసి త్వరగా రికవరీ అయ్యారు. క్రమం తప్పకుండా సంజయ్ చేసిన కసరత్తులను చూసి ఆయనకు వైద్యం అందించిన వారే షాక్ అయ్యారట.
అధీరా ఇలా సాధ్యమైంది
‘‘క్యాన్సర్‌ను ఓ సవాలుగా స్వీకరించి, విజయం అందుకున్నా. ఆ ప్రయాణం నాకెంతో నచ్చింది. దాన్నుంచి కోలుకున్న తర్వాత ఓ పద్ధతి ప్రకారం జీవితాన్ని ఆస్వాదిస్తున్నా. నా భార్య మాన్యతాదత్, పిల్లలు నా వెన్నంటే ఉండి ఎంతో ధైర్యాన్నిచ్చారు. నా భార్య తర్వాత అంతగా నాలో స్ఫూర్తినింపింది నా పిల్లలే. కేజీయఫ్.. టీమ్ నాకెంతో సహకారం అందించింది. ముఖ్యంగా ప్రశాంత్ నీల్ చాలా కంఫర్ట్‌గా చూసుకున్నారు. వీరందరి వల్లే నేను ‘అధీరా’ అయ్యా’’ అని సంజయ్ ఓ ఇంటర్య్వూలో తెలిపారు. కథానాయకుడిగా అయినా ప్రతినాయకుడిగా అయినా సంజయ్ తెరపై కనిపిస్తే భారతీయ సినిమా అభిమానులకు పండగే. ఆ పండగ వాతావరణం మరికొన్ని గంటల్లోనే రాబోతుంది. ‘అధీరా’గా సంజయ్ నటించిన ‘కేజీయఫ్ ఛాప్టర్ 2’ గురువారం విడుదలకానుంది. యశ్ హీరోగా కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన చిత్రమిది. సంజయ్ ప్రస్తుతం.. ‘ఘడ్చది’, ‘తులసీదాస్ జూనియర్’ తదితర హిందీ చిత్రాలతో బిజీగా ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
హీరోగా తన తొలి సినిమా విడుదలైన రోజే అల్లు అర్జున్‌కు అరుదైన గౌరవం దక్కింది. అదేంటంటే? -
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
మేం మాటల మనుషులం కాదు.. చేసి చూపిస్తాం: బాలకృష్ణ
బాలకృష్ణ హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన చిత్రాల్లో ‘లెజెండ్’ ఒకటి. ఈ సినిమా విడుదలై పదేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా నిర్వహించిన వేడుకలో బాలకృష్ణ సందడి చేశారు. -
ప్రెగ్నెన్సీపై స్పందించిన పరిణీతి చోప్రా.. ఏమన్నారంటే!
తల్లి కానున్నట్లు వస్తోన్న రూమర్స్‌పై నటి పరిణీతి చోప్రా స్పందించారు. -
అక్షయ్‌తో బ్రేకప్.. ఆత్మహత్య వార్తలపై స్పందించిన రవీనా టాండన్
అక్షయ్ కుమార్ (Akshay Kumar)తో వివాహం రద్దు కావడంపై నటి రవీనా టాండన్ (Raveena Tandon) స్పందించారు. బ్రేకప్ తర్వాత వచ్చిన పలు కథనాల గురించి ఆమె మాట్లాడారు. -
‘పుష్ప3’ టైటిల్ ఇదేనా.. వైరలవుతోన్న న్యూస్!
‘పుష్ప3’ మూడో భాగానికి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనికి టైటిల్ ఖరారైనట్లు తెలుస్తోంది. -
అదితితో పెళ్లి వార్తలు.. ఫొటో షేర్ చేసిన సిద్ధార్థ్
నటుడు సిద్ధార్థ్ (Siddharth), నటి అదితి రావు హైదరీ (Aditi rao Hydari) వివాహం చేసుకున్నారంటూ బుధవారం నెట్టింట వార్తలు చక్కర్లు కొట్టాయి. దీనిపై తాజాగా వీరిద్దరూ స్పందించారు. -
అనుపమ బాధపడటానికి కారణమదే: సిద్ధు జొన్నలగడ్డ
‘టిల్లు స్క్వేర్’ (Tillu Square)తో ప్రేక్షకులకు వినోదాన్ని అందించేందుకు సిద్ధమయ్యారు సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda), అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran). ‘డీజే టిల్లు’కు సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. -
చిత్రీకరణ కోసం ఇతర దేశాలకు వెళ్లడం తప్పేంకాదని తెలుసుకున్నా: ప్రియమణి
జాతీయ అవార్డు అందుకున్న తర్వాతే కథల ఎంపికలో మార్పు వచ్చిందని ప్రియమణి అన్నారు. -
వరుస ఫ్లాప్స్ వల్లే రాజకీయాల్లోకి అడుగుపెట్టారా: కంగన సమాధానం ఏమిటంటే..?
నటి కంగనా రనౌత్ (Kangana Ranaut) ఇటీవల రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఉన్నట్టుండి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడంపై ఆమె తాజాగా స్పందించారు. -
నన్ను తిట్టుకోవద్దు.. ఈసారి నేను ఎలాంటి లీకులు ఇవ్వలేను: దిల్‌రాజు
రామ్‌చరణ్ (Ram Charan) పుట్టినరోజు సందర్భంగా బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లో వేడుకలు జరిగాయి. పలువురు సినీ ప్రముఖులు ఇందులో సందడి చేశారు. చరణ్‌తో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. -
రాశీఖన్నా ‘గోల్డెన్’ మెరుపులు.. అలా చూడొద్దన్న కేతిక.. టీమ్‌తో కృతి సనన్
సినీ తారలు సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
లీడర్ పిలిస్తే.. జనసేన పార్టీ ప్రచారానికి సిద్ధంగా ఉన్నా: నటి అనసూయ
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనసూయ పొలిటికల్ పార్టీల తరఫున ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. -
సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్న స్టార్ హీరోయిన్.. కారణమిదేనా!
దీపికా పదుకొణెకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె సినిమాలకు బ్రేక్ తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. -
వారిద్దరు టామ్ అండ్ జెర్రీలా.. మెగా, మంచు ఫ్యామిలీలపై మనోజ్ డైలాగ్
రామ్ చరణ్ పుట్టిన రోజు వేడుకలకు హీరో మంచు మనోజ్ తదితరులు అతిథులుగా హాజరై, సందడి చేశారు. -
జాన్వీతో రామ్ చరణ్ సినిమా.. ఏడేళ్ల క్రితమే కోరిక బయటపెట్టిన చిరంజీవి
రామ్ చరణ్- జాన్వీ కపూర్ కలిసి సినిమా చేయాలని చిరంజీవి ఏడేళ్ల క్రితమే కోరుకున్నారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని బయటపెట్టారు. -
వరుస పరాజయాలతో నిద్రలేని రాత్రులు.. నేను కాబట్టి తట్టుకోగలిగా: స్టార్ హీరోయిన్
దాదాపు 25 ఏళ్ల సినీ కెరీర్లో తాను ఎదుర్కొన్న ఇబ్బందులపై బాలీవుడ్ నటి కరీనా కపూర్ (Kareena Kapoor) స్పందించారు. కెరీర్ ఆరంభంలో ఎన్నో ప్రశంసలు అందుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద విజయం అందుకోవడానికి అవి ఏమాత్రం ఉపయోగపడలేదన్నారు. -
‘ఇదొక అద్భుతమైన చిత్రం.. ప్రేక్షకులు తప్పక సపోర్ట్ చేయాలి’ - కమల్ హాసన్
పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) ప్రధాన పాత్రలో నటించిన ‘ఆడు జీవితం’(Aadujeevitham)పై అగ్ర కథానాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) ప్రశంసల వర్షం కురిపించారు. -
వివాహ బంధంలోకి సిద్ధార్థ్ - అదితి రావు
నటుడు సిద్ధార్థ్ (Siddharth) అదితిరావు హైదరీ (Aditi Rao Hydari)ని వివాహం చేసుకున్నారు. -
రామ్‌చరణ్ బర్త్‌డే.. భక్తులకు సురేఖ అన్నదానం
నటుడు రామ్‌చరణ్ (Ram Charan) పుట్టినరోజు నేడు. ఈ వేడుకలను ఆయన తల్లి సురేఖ ప్రత్యేకంగా సెలబ్రేట్ చేశారు. -
లండన్‌లో ఇల్లు కొన్న ప్రభాస్..?
ప్రభాస్(prabhas)కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం నెట్టింట వైరల్‌గా మారింది. విలాసవంతమైన ఇంటిని ఆయన కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.