Maanvi Gagroo: హాస్య నటుడితో మాన్వి వివాహం.. ఫొటోలు వైరల్‌

బాలీవుడ్‌ నటులు మాన్వీ గాగ్రూ, కుమార్‌ వరుణ్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. పెళ్లి ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు.

Published : 24 Feb 2023 01:21 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘ఫోర్‌ మోర్‌ షాట్స్‌ ప్లీజ్‌!’ సిరీస్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి మాన్వీ గాగ్రూ (Maanvi Gagroo), హాస్య నటుడు కుమార్‌ వరుణ్‌ (Kumar Varun) వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కుటుంబ సభ్యులు, క్లోజ్‌ ఫ్రెండ్స్‌ సమక్షంలో పెళ్లి వైభవంగా జరిగినట్టు వీరివురు సోషల్‌ మీడియా వేదికగా తెలిపారు. వెడ్డింగ్‌ స్టిల్స్‌ను అభిమానులతో పంచుకుంటూ ‘ఇప్పటి వరకూ మేం వేర్వేరుగా మీ ప్రేమను పొందాం. కలిసి చేసే ప్రయాణానికీ మీ ఆశీస్సులు కావాలి’’ అని కోరారు. ఎంతో ప్రత్యేకమైన రోజు (23-02-2023)న పెళ్లి చేసుకోవడం మరింత ఆనందాన్ని ఇచ్చిందన్నారు. సినీ ప్రముఖులు, నెటిజన్లు, అభిమానులు ఈ నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

‘ఏ క్వశ్చన్‌ మార్క్‌’, ‘కిల్‌ దిల్‌’, ‘పీకే’, ‘తూ హై మేరా సండే’, ‘శుభ్‌ మంగళ్‌ జ్యాదా సావ్‌ధాన్‌’ తదితర చిత్రాల్లో కీలక పాత్రలు పోషించిన మాన్వికి ‘ఫోర్‌ మోర్‌ షాట్స్‌ ప్లీజ్‌’ సిరీస్‌ మంచి క్రేజ్‌ తెచ్చిపెట్టింది. స్టాండప్‌ కమెడియన్‌, రచయితగా గుర్తింపు పొందిన కుమార్‌ వరుణ్‌ ‘చాచా విధాయక్‌ హై హమారే’, ‘పరివార్’ తదితర సిరీస్‌ల్లో నటించి మెప్పించారు. లాక్‌డౌన్‌ సమయంలో ‘క్విజ్‌ విత్‌ ది కమెడియన్స్‌’ అనే షో నిర్వహించి, దానికి హోస్ట్‌గా వ్యవహరించారు. కుమార్‌ వరుణ్‌, మాన్వి పెళ్లి ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని