Mahesh Babu: మహేశ్ కోసం ఆ హీరోయిన్‌ను ఎంపిక చేసిన రాజమౌళి?

రాజమౌళి-  మహేశ్‌ బాబు కాంబోలో తెరకెక్కనున్న సినిమా.. పూర్తి స్క్రిప్టు సిద్ధమవకముందే ఎన్నో అంచనాలు పెంచేసింది.

Published : 08 Mar 2022 10:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రాజమౌళి- మహేశ్‌ బాబు కాంబోలో తెరకెక్కనున్న సినిమా.. పూర్తి స్క్రిప్టు సిద్ధమవకముందే ఎన్నో అంచనాలు పెంచేసింది. ఈ కాంబినేషన్‌పై ప్రేక్షకుల్లోనే కాదు చిత్ర పరిశ్రమలోనూ ఆసక్తి నెలకొంది. అడవి నేపథ్యంలో సాగే యాక్షన్‌ సినిమా అనే ఊహాగానాలు ఆ అంచనాలను రెట్టింపు చేశాయి. ఇప్పుడు మరో ఆసక్తికర వార్త టాలీవుడ్‌ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ క్రేజీ ప్రాజెక్టులో మహేశ్‌బాబు సరసన బాలీవుడ్‌ నటి అలియా భట్‌ సందడి చేయనుందని టాక్‌ వినిపిస్తోంది. ఈ చిత్రంలోని కథానాయిక పాత్రకు అలియానే న్యాయం చేయగలదని భావించిందట చిత్ర బృందం. ఈ మేరకు ఆమెను సంప్రదించిందని తెలుస్తోంది. మహేశ్‌ బాబుతో కలిసి నటించేందుకు అలియా సుముఖంగా ఉందని, వచ్చే ఏడాది ఈ సినిమా పట్టాలెక్కే అవకాశాలున్నాయని సమాచారం. అధికారిక ప్రకటన రావాల్సిఉంది. విజువల్‌ ఎఫెక్ట్స్‌కు అధిక ప్రాధాన్యత ఉండే ఈ పాన్‌ ఇండియా సినిమాకు రాజమౌళి తండ్రి, ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్‌ కథ అందిస్తున్నారు.

రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ కథానాయికలుగా రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంలో అలియా ఓ కథానాయికగా నటించింది. ఈ సినిమాతోనే ఆమె టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తుంది. ఈ చిత్రం మార్చి 25న ప్రేక్షకుల ముందుకురానుంది. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందించారు. రాజమౌళి దర్శకత్వంలో వెంటవెంటనే రెండు పాన్‌ ఇండియా చిత్రాల్లో నటించే అవకాశం అలియా అందుకోవడం విశేషమని సినీ వర్గాలు పేర్కొన్నాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని