Sonakshi Sinha: సోనాక్షి సిన్హా నిశ్చితార్థం?

సోషల్‌ మీడియాలో చురుకుగా ఉండే బాలీవుడ్‌ నటి సోనాక్షి సిన్హా సోమవారం పోస్ట్‌ చేసిన ఓ ఫొటో అందరిలో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇందులో ఆమె వేలికి ఉంగరం ఉండటమే ఇందుకు కారణం.

Published : 10 May 2022 02:29 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సోషల్‌ మీడియాలో చురుకుగా ఉండే బాలీవుడ్‌ నటి సోనాక్షి సిన్హా సోమవారం పోస్ట్‌ చేసిన ఓ ఫొటో అందరిలో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇందులో ఆమె వేలికి ఉంగరం ఉండటమే ఇందుకు కారణం. ‘‘నాకెంతో ప్రత్యేకమైన రోజు. నా కల నిజమైంది. ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నందుకు ఆనందిస్తున్నా’’ అని వ్యాఖ్యానించడంతో కొందరు ఆమెకు ఎంగేజ్‌మెంట్‌ అయిందనుకుంటున్నారు. పలువురు సినీ ప్రముఖులు కామెంట్ల రూపంలో శుభాకాంక్షలు తెలియజేశారు. రింగ్‌పైనే అందరి దృష్టి పడేలా చేసిన సోనాక్షి తన పక్కన ఉన్న వ్యక్తిని మాత్రం చూపించలేదు. ఫొటలో ఆయనపై చేయి వేసి కనిపించింది. మరి ఆమెకు నిశ్చితార్థం అయిందా, షూట్‌లో భాగంగా స్టిల్‌ ఇచ్చిందా? అనేది తెలియాలంటే సోనాక్షి స్పష్టతనివ్వాల్సిందే. ‘దబాంగ్‌’తో నటిగా కెరీర్‌ ప్రారంభించిన ఆమె ‘రౌడీ రాథోడ్‌’, ‘జోకర్‌’, ‘సన్నాఫ్‌ సర్ధార్‌’, ‘ఆర్‌.. రాజ్‌కుమార్‌’, ‘లింగా’, ‘వెల్‌కమ్‌ టు న్యూయార్క్‌’, ‘భుజ్‌’ తదితర చిత్రాల్లో మెరిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని