NMACC launch: నీతా అంబానీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఓపెనింగ్.. బీటౌన్ తారల సందడి
నీతా ముకేశ్ అంబానీ కల్చరల్ సెంటర్ ఆరంభోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకల్లో సినీ ప్రముఖులు సందడి చేశారు.
ముంబయి: రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్పర్సన్ నీతా అంబానీ (Nita Ambani) కలల ప్రాజెక్ట్ ‘ఎన్ఎంఏసీసీ’ (నీతా ముకేశ్ అంబానీ కల్చరల్ సెంటర్) ప్రారంభ వేడుకలు శుక్రవారం రాత్రి ఘనంగా జరిగాయి. ముంబయిలోని జియో వరల్డ్ సెంటర్లో ఏర్పాటు చేసిన ఈ కల్చరల్ సెంటర్ ఆరంభోత్సవాలు మూడురోజులపాటు జరగనున్నాయి. మొదటిరోజు జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో ముకేశ్ అంబానీ కుటుంబసభ్యులు, కాబోయే జంట అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇక, బాలీవుడ్, హాలీవుడ్, సౌత్ సినీ పరిశ్రమలకు చెందిన తారలు ఈ వేడుకల్లో సందడి చేశారు. అగ్రనటుడు రజనీకాంత్ ఆయన కుమార్తె సౌందర్య, బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, ఆయన సతీమణి గౌరీ ఖాన్, కుమారుడు ఆర్యన్‌ఖాన్, కుమార్తె సుహానా ఖాన్, సల్మాన్‌ఖాన్, వరుణ్ ధావన్, షాహిద్ కపూర్ ఆయన సతీమణి మీరా రాజ్‌పుత్, సిద్ధార్థ్ మల్హోత్ర-కియారా అడ్వాణీ దంపతులు, దీపికా పదుకొణె-రణ్వీర్ సింగ్, ప్రియాంకా చోప్రా-నిక్ జొనాస్, శ్రద్ధాకపూర్, జాన్వీకపూర్, సోనమ్ కపూర్, అలియాభట్ కుటుంబం.. ఇలా ఎంతోమంది సెలబ్రిటీలు ఇందులో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
నీతా అంబానీ డ్రీమ్ ప్రాజెక్ట్‌గా ‘ఎన్ఎంఏసీసీ’ ప్రాచుర్యం పొందింది. భారతీయ సంస్కృతి, అంతరించిపోతున్న కళలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఆమె దీనిని ప్రారంభించారు. ఈ నాలుగంతస్తుల భవంతిలో ఒక మ్యూజియం, 2000 మంది సామర్థ్యంతో కూడిన థియేటర్, ఆర్ట్ అండ్ ఎగ్జిబిషన్‌కు ప్రత్యేక స్థలం, స్టూడియో థియేటర్ ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ayyannapatrudu: వైకాపా ప్రభుత్వ అక్రమాలు కనిపించడం లేదా ఉండవల్లీ?: అయ్యన్న
-
కాంగ్రెస్‌కు మల్లన్న సినిమా చూపిస్తా: మంత్రి మల్లారెడ్డి
-
Nizamabad: అపహరించిన కారులో వచ్చి.. ఏటీఎం లూటీ
-
బాంబులా పేలిన ఫోను.. కిటికీలు, సామాన్లు ధ్వంసం
-
ఐఏఎస్ కొలువుకు ఎసరు తెచ్చిన ‘కుక్క వాకింగ్’
-
పసిప్రాణాన్ని కాపాడిన వృద్ధులు