Ram Charan: రామ్‌ చరణ్‌తో ఎలాంటి విభేదాలు లేవు..: బాలీవుడ్‌ డైరెక్టర్‌

మెగా హీరో రామ్‌ చరణ్‌ నటించిన ‘జంజీర్‌’ (Zanjeer) దర్శకుడు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా చరణ్‌ (Ram Charan)కు తనకు మధ్య ఉన్న స్నేహం గురించి చెప్పాడు. 

Published : 30 May 2023 14:30 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రతి సినిమాలో ప్రత్యేకతను చూపుతూ గ్లోబల్‌ స్టార్‌గా ఎదిగాడు రామ్‌ చరణ్‌ (Ram Charan). ఎన్నో బ్లాక్‌ బస్టర్‌ చిత్రాల్లో నటించి ఎంతో మంది వీరాభిమానులను సొంతం చేసుకున్నాడు.  ఈ మెగా పవర్‌ స్టార్‌ ప్రస్తుతం శంకర్‌ దర్శకత్వంలో ‘గేమ్‌ ఛేంజర్‌’లో నటిస్తున్నాడు. తాజాగా ఓ బాలీవుడ్‌ డైరెక్టర్‌ రామ్‌ చరణ్‌ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

రామ్‌ చరణ్‌ హీరోగా బాలీవుడ్‌ దర్శకుడు అపూర్వ లఖియా (Apoorva Lakhia) తెరకెక్కించిన చిత్రం జంజీర్‌ (Zanjeer). ఈ చిత్రం తెలుగులో ‘తుపాన్‌’ (Thoofan) పేరుతో విడుదలైంది. ఈ సినిమా రామ్ చరణ్‌ కెరీర్‌లో ప్లాప్‌గా నిలిచింది. అయితే దీని తర్వాత చరణ్‌ ఈ దర్శకుడిని దూరం పెట్టాడని ప్రచారం జరిగింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అపూర్వ లఖియా ఈ విషయం గురించి మాట్లాడాడు.. ‘‘రామ్‌ చరణ్‌, నేను మంచి స్నేహితులం. ‘జంజీర్‌’ తర్వాత కూడా నేను ఎన్నో సార్లు వాళ్లింటికి వెళ్లాను. వాళ్ల ఇంట్లో చాలా రోజులు ఉన్నాను. అతడు ఇప్పుడు నా ఫోన్‌ తీయడం లేదు. ఎందుకంటే తను సినిమా పనుల్లో చాలా బిజీగా ఉన్నాడు.. పైగా అతడికి ఎక్కువగా ఫోన్లకు ఆన్సర్‌ చేసే అలవాటు లేదు. అందుకే ఉపాసన (Upasana) నా ఫోన్‌కు ఆన్సర్‌ చేస్తుంది.  మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) షూటింగ్‌ సమయంలో కూడా మేము మాట్లాడుకున్నాం. ఉక్రెయిన్‌లో చిత్రీకరణ జరుగుతున్నప్పుడు చరణ్‌ నాకు ఫోన్‌ చేశాడు. యాక్షన్‌ సన్నివేశాల గురించి చర్చించుకున్నాం. హైదరాబాద్‌కు ఇప్పుడు వెళ్లినా అతడు నన్ను కలుస్తాడు’’ అని చెప్పాడు.

ఇక ‘జంజీర్‌’తో రామ్‌ చరణ్‌ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. ఈ చిత్రంలో చరణ్‌ సరసన ప్రియాంక చోప్రా నటించింది. 2013లో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించలేకపోయింది. అంతేకాదు రామ్‌ చరణ్‌, ప్రియాంకల జోడీ బాలేదంటూ ట్రోల్స్‌ చేశారు. ఈ సినిమాలో సంజయ్‌దత్‌ కూడా కీలక పాత్రలో నటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు