Akshay Kumar: మేకలూ స్టంట్లు చేస్తాయి!
బాలీవుడ్ యాక్షన్ కథానాయకుడు సినిమాల్లో చేసే పోరాటాలు, స్టంట్లు గురించి అందరికీ తెలిసిందే. మార్షల్ ఆర్ట్స్‌లో ప్రావీణ్యం ఉన్న ఆయన పాత్ర కోసం ఎలాంటి సాహసాలైనా చేస్తుంటారు. ఇప్పుడు అక్షయ్ పక్కన ఉండే సరికి మేకలు
బాలీవుడ్ యాక్షన్ కథానాయకుడు సినిమాల్లో చేసే పోరాటాలు, స్టంట్లు గురించి అందరికీ తెలిసిందే. మార్షల్ ఆర్ట్స్‌లో ప్రావీణ్యం ఉన్న ఆయన పాత్ర కోసం ఎలాంటి సాహసాలైనా చేస్తుంటారు. ఇప్పుడు అక్షయ్ పక్కన ఉండే సరికి మేకలు కూడా స్టంట్లు చేస్తున్నాయట. నిత్యం సినిమాలతో బిజీ ఉండే అక్షయ్ సరదాగా, ఆటవిడుపుగా కాసేపు సాధుజీవాలతో గడిపారు. రెండు చేతుల్లో గడ్డి పట్టుకొని మేకలో మంద మధ్యకి వెళ్లేసరికి అవి మీదపడుతూ, గడ్డి కోసం భుజాల వరకూ ఎగురుతుంటే అక్షయ్ ఆనందంగా ఆ గడ్డిని వాటికి పెడుతున్నారు. మేకలతో సరదాగా గడిపిన ఆ వీడియోని సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు అక్షయ్. ‘‘చిన్న చిన్న విషయాల్లోనే నేను ఎంతో ఆనందాన్ని వెతుక్కుంటాను’’అని రాశారు అక్షయ్. దీనికి నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. ‘ఖిలాడీ’ కుమార్‌ను కలిసేసరికి మేకలు స్టంట్లు చేసేస్తున్నాయి’ అని ఒక నెటిజన్ స్పందిస్తే...‘కపిల్ శర్మ షోకు ప్రతి నెలా వెళ్లినట్టే మా దగ్గరకు వస్తుంటారు అక్షయ్ అని మేకలు మురిసిపోతున్నాయి’ అని మరో నెటిజన్ స్పందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.