Tamannaah: ఆ విషయం గురించి మాట్లాడితే తమన్నా నన్ను కొడుతుందేమో: బాలీవుడ్‌ హీరో

తమన్నా (Tamannaah), విజయ్‌ వర్మ(Vijay Varma)ల గురించి బాలీవుడ్‌ హీరో మాట్లాడాడు. ప్రస్తుతం ఆ హీరో చెప్పిన సమాధానం నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

Published : 29 May 2023 19:14 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌:  మిల్కీ బ్యూటీ తమన్నా (Tamannaah), బాలీవుడ్‌ హీరో విజయ్‌ వర్మ (Vijay Varma) ఇద్దరూ ప్రేమలో ఉన్నారంటూ కొంత కాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల విజయ్‌ వర్మ ఫ్రెండ్‌ గుల్షన్ దేవయ్య (Gulshan Devaiah) వీరిద్దరిపై సరదాగా చేసిన కామెంట్స్‌ వైరల్‌ కాగా.. కొందరు ఈ హీరోను దారుణంగా ట్రోల్స్‌ చేశారు. అయితే తాజాగా గుల్షన్‌ ఒక ఇంటర్వ్యూలో మరోసారి ఈ విషయంపై స్పందించారు.

పుట్టినరోజు సందర్భంగా ఓ మీడియాతో గుల్షన్‌ మాట్లాడాడు.. అందులో తమన్నా-విజయ్‌ వర్మల గురించి ప్రశ్న ఎదురుకాగా ఆసక్తికరమైన సమాధానం చెప్పాడు. నవ్వుతూ చెప్పిన ఈ సమాధానం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ‘‘నేను, విజయ్‌ వర్మ మంచి స్నేహితులం. తను తమన్నాతో ప్రేమలో ఉన్నాడా.. లేదా.. అనే విషయం నాకు తెలీదు. వాళ్లిద్దరూ కలిసి ఉన్న ఫొటోలు మాత్రమే నేను చూశా. నేనెప్పుడూ తమన్నాను కలవలేదు. ఆమె ఎవరో కూడా నాకు తెలీదు. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆమె గురించి మాట్లాడినందుకు ఆమె అభిమానులు నన్ను ట్రోల్‌ చేశారు. అది వాళ్లిద్దరి వ్యక్తిగత విషయం. నేను విజయ్‌ వర్మను సరదాగా ఏడిపించడం కోసం అలా మాట్లాడాను. ఈసారి ఆ విషయం గురించి మాట్లాడితే తమన్నానే నన్ను కొడుతుందేమో. నా చెంప చెళ్లుమనడం నాకు ఇష్టం లేదు’’ అంటూ నవ్వులు పూయించాడు.

ఇక విజయ్‌ వర్మతో మిల్కీ బ్యూటీ ప్రేమలో పడిందంటూ బాలీవుడ్‌ మీడియా కోడై కూస్తోంది. న్యూ ఇయర్‌ వేడుకలు మొదలుకొని.. బాలీవుడ్‌లో ఏ ఈవెంట్‌ జరిగినా వీళ్లిద్దరూ కలిసి వెళ్తుండడంతో ఈ వార్తలు జోరందుకున్నాయి. ఇటీవల ఓ డిన్నర్‌కు వెళ్లిన వీళ్లిద్దరూ ఒకే కారులో వెళ్తూ ఫొటోలకు పోజులిచ్చారు. ఫొటోగ్రాఫర్లకు హాయ్‌ చెబుతూ నవ్వుతూ ముందుకు సాగారు. సినిమాల సంగతికొస్తే ప్రస్తుతం తమన్నా అగ్ర కథానాయకుడు చిరంజీవి సరసన ‘భోళా శంకర్‌’ (Bhola Shankar)లో నటిస్తోంది. అలాగే రజనీకాంత్‌ ‘జైలర్‌’ (Jailer)లోనూ కనిపించనుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు