Rohit Shetty: ఇది బాలీవుడ్‌కి ముగింపు కాదు: రోహిత్‌ శెట్టి

ప్రపంచవ్యాప్తంగా దక్షిణాది చిత్రాలు పాపులరైనంత మాత్రన బాలీవుడ్‌ కథ ముగిసిపోయినట్లు కాదని దర్శకుడు రోహిత్‌ శెట్టి అన్నారు. సినిమా వేడుకలో భాగంగ.....

Updated : 29 May 2022 13:40 IST

ముంబయి: ప్రపంచవ్యాప్తంగా దక్షిణాది చిత్రాలు బాగా ఆడుతున్నంత మాత్రన బాలీవుడ్‌ కథ ముగిసిపోయినట్లు కాదని దర్శకుడు రోహిత్‌ శెట్టి అన్నారు. ఓ సినిమా వేడుకలో భాగంగా ముంబయిలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో నటుడు రణ్‌వీర్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. ప్రస్తుతం చర్చ జరుగుతోన్న ‘నార్త్‌ వర్సెస్‌ సౌత్‌’ అంశంపై రోహిత్‌ స్పందించారు.

‘బాలీవుడ్‌కి ఎండ్‌ కార్డ్‌ వేయడం సాధ్యం కాదు. 1980ల్లో వీసీఆర్‌లు వచ్చినప్పుడు, ఇకపై ఎవరూ థియేటర్లకు రారు.. బాలీవుడ్‌ పనైపోయిందన్నారు. ఇటీవల ఓటీటీ వచ్చినప్పుడు కూడా అలాగే అన్నారు. అయితే.. బాలీవుడ్‌ కథ ఎప్పటికీ ముగిసిపోదు. ఒకసారి మనం చరిత్ర చూసుకుంటే.. గతంలోనూ దక్షిణాది చిత్రాలు బాలీవుడ్‌లోకి రీమేక్‌ అయ్యాయి. 1980ల్లో అమితాబ్‌ బచ్చన్‌, వినోద్‌ ఖన్నా వంటి స్టార్స్‌ పరిశ్రమలో రాణిస్తున్న సమయంలో దక్షిణాది నుంచి ఓ గొప్ప నటుడు వచ్చారు.. ఆయనే కమల్‌హాసన్‌. ఆయన నటించిన చిత్రాలు ఇక్కడా మంచి విజయాలు అందుకున్నాయి. ఉత్తరాది, దక్షిణాది ఈ రెండు పరిశ్రమలు దేనికవే గొప్ప నటీనటులతో మంచి సినిమాలు తెరకెక్కిస్తున్నాయి. కాకపోతే ఈ రెండు పరిశ్రమలను పోల్చి చూడటం వల్లే ఇలాంటి చర్చలు తెరపైకి వస్తున్నాయి’’ అని రోహిత్‌ వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని