Rashmika: ‘ర్యాంబో’ సరసన రష్మిక
సిల్వెస్టర్ స్టాలోన్ నటించిన ‘ర్యాంబో’ సిరీస్ చిత్రాలు ఆ కాలంలో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించాయి. టైగర్ ష్రాఫ్ కథానాయకుడిగా ఇందులో ఒక సినిమాని హిందీలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకుడు. రోహిత్ ధావన్ నిర్మిస్తున్నారు.
సిల్వెస్టర్ స్టాలోన్ నటించిన ‘ర్యాంబో’ సిరీస్ చిత్రాలు ఆ కాలంలో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించాయి. టైగర్ ష్రాఫ్ (Tiger Shroff) కథానాయకుడిగా ఇందులో ఒక సినిమాని హిందీలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకుడు. రోహిత్ ధావన్ నిర్మిస్తున్నారు. అభిమానుల్లో ఈ చిత్రంపై ఎంతో ఆసక్తి నెలకొంది. సినీవర్గాలు దీనికి సంబంధించి శనివారం ఓ కొత్త కబురు వినిపించాయి. ఇందులో టైగర్‌కి జోడీగా రష్మిక (Rashmika) నటించనున్నట్టు సమాచారం. ‘‘స్క్రూ ఢీలా’తోనే టైగర్‌ష్రాఫ్, రష్మిక కలిసి నటించాల్సి ఉంది. వేర్వేరు కారణాలతో ఈ ప్రాజెక్టు ముందుకెళ్లలేదు. రోహిత్ ధావన్, సిద్ధార్థ్ ఆనంద్ ఆమెతో చర్చలు జరిపారు. నాయికగా నటించడానికి రష్మిక సుముఖంగా ఉన్నారు’’ అని సినీవర్గాలు తెలిపాయి. వచ్చే ఏడాది వేసవి నుంచి చిత్ర షూటింగ్ తొలి షెడ్యూల్ మొదలు కానుంది. ‘ర్యాంబో’లో చాలామంది హాలీవుడ్ సాంకేతికవర్గ నిపుణులు పని చేయనున్నారు.
కొత్త జోడీ
శ్రీవిష్ణు (Sree Vishnu) కథానాయకుడిగా... రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. రాజేష్ దండా నిర్మాత. అనిల్ సుంకర సమర్పకులు. ఈ చిత్రంలో కథానాయికగా రెబా మోనికా జాన్ (Reba Monica John) ఎంపికయ్యారు. ఈమె తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో నటించిన కథానాయిక. హాస్యభరితమైన కుటుంబ కథతో రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణని త్వరలోనే మొదలు పెట్టనున్నట్టు చిత్రవర్గాలు తెలిపాయి. సుదర్శన్, శ్రీకాంత్ అయ్యంగార్, దేవీప్రసాద్, ప్రియ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ: భాను భోగవరపు, సంగీతం: గోపీసుందర్, ఛాయాగ్రహణం: రామ్‌రెడ్డి, కూర్పు: ఛోటా కె.ప్రసాద్, కళ: బ్రహ్మ కడలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Balakrishna: 2014 రోజులు గుర్తొస్తున్నాయి... జయం మనదే
‘‘మంచి ఉద్దేశంతో సినిమా తీస్తే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. వాళ్ల ఆదరణ ఒక బాధ్యతగా భావిస్తా. సమాజం పట్ల స్పృహతో, రాజకీయంగానూ చైతన్యం కలిగించాలనే ఆలోచనతోనే కథాంశాల్ని ఎంచుకుంటా. 2014లో ఎన్నికలకు ముందు ‘లెజెండ్’ విడుదలైంది. -
టిల్లు నవ్వడు.. నవ్వేలా చేస్తాడు!
‘డీజే టిల్లు’ చిత్రంతో సినీప్రియుల మదిపై చెరగని ముద్ర వేశారు సిద్ధు జొన్నలగడ్డ. ఆ పాత్రతో తెరపై ఆయన చేసిన అల్లరి అందర్నీ కడుపుబ్బా నవ్వించింది. దీంతో ఇప్పుడదే టిల్లు పాత్రతో మరోసారి అలరించేందుకు ‘టిల్లు స్క్వేర్’ సినిమాతో సిద్ధమయ్యారు సిద్ధు. -
కొన్నేళ్లపాటు గుర్తుపెట్టుకునేలా... ఫ్యామిలీస్టార్
తన కుటుంబాన్ని పైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించే ప్రతి వ్యక్తి ఫ్యామిలీస్టార్ అని చెప్పడమే ఈ సినిమా కథాంశం అన్నారు దిల్‌రాజు. ఆయన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్‌తో కలిసి నిర్మించిన చిత్రం ‘ఫ్యామిలీస్టార్’. -
చివరి తరంలో స్టార్స్ మేమే
‘‘చిత్రపరిశ్రమలో హిట్స్ మాత్రమే అందుకున్న నటీనటులు ఎవరు లేరు. ప్రతి ఒక్కరూ వారి కెరీర్లో హిట్ ఫ్లాప్‌ల రుచి చూశాకే విజయబాటలో నడుస్తార’’ని అంటోంది బాలీవుడ్ నాయిక కంగనా రనౌత్. -
హీరామండీ తారల మెరుపులు అప్పుడే
భారతీయ సినిమా స్థాయిని పెంచిన దర్శకుల్లో సంజయ్ లీలా భన్సాలీ ఒకరు. ప్రతి చిత్రాన్ని ఎంతో క్లాసిక్‌గా తీర్చిదిద్దడం ఈయన స్టైల్. త్వరలో తన కలల ప్రాజెక్టు ‘హీరామండీ: -
పేరు... ఆ రోజు
రజనీకాంత్ కథానాయకుడిగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. రజనీకి ఇది 171వ చిత్రం. సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. -
చరిత్రను మార్చిన సంఘటన
బాలీవుడ్ కథానాయకుడు విక్రాంత్ మాస్సే, రాశీ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ది సబర్మతీ రిపోర్ట్’. రంజన్ చందేల్ తెరకెక్కిస్తున్నారు. -
సూర్య 44వ చిత్రం ఖరారు
ప్రేక్షకుల్ని... అభిమానుల్ని ఆశ్చర్య పరుస్తూ తన కొత్త సినిమాని ప్రకటించారు సూర్య. ఎవరూ ఊహించని రీతిలో కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్టు ప్రకటించారు. అసలేమాత్రం ప్రచారంలోకి రాని కలయిక ఇది. -
తగ్గేదేలే..
దుబాయిలోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో గురువారం తన మైనపు విగ్రహం వద్ద అల్లు అర్జున్ -
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
‘అఖండ 2’లో బాలకృష్ణ లుక్స్ ‘అఖండ’కు మించి ఉంటాయని రామ్స్ అన్నారు. తాను హీరోగా నటించిన ‘ఫైటర్ రాజా’ టీజర్ లాంచ్ ఈవెంట్లో ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు. -
అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
హీరోగా తన తొలి సినిమా విడుదలైన రోజే అల్లు అర్జున్‌కు అరుదైన గౌరవం దక్కింది. అదేంటంటే? -
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
-
ముఖ్యమంత్రితో ముఖాముఖిలో వాలంటీరు
-
కేరళలోనూ రియాన్ గురించే అడిగేవారు.. ఇప్పుడు 15 మంది కీలకమే: సంజూ
-
భారాస నేత ఇంట్లో గోడ గడియారాలు, మద్యం సీసాల పట్టివేత