Rashmika: ‘ఆషికీ’ అవకాశం రష్మికకేనా?

దక్షిణాది అందం రష్మిక బాలీవుడ్‌లోనూ సత్తా చాటుతోంది. తాజాగా అక్కడ మరో సినిమా అవకాశం దక్కించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. సంగీత ప్రియుల్ని అలరించిన ‘ఆషికీ’ సిరీస్‌లో వస్తోన్న ‘ఆషికీ 3’లో ఆమెకు ఓకే అయ్యిందంటు బాలీవుడ్‌ సమాచారం.

Updated : 19 Sep 2022 08:24 IST

క్షిణాది అందం రష్మిక బాలీవుడ్‌లోనూ సత్తా చాటుతోంది. తాజాగా అక్కడ మరో సినిమా అవకాశం దక్కించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. సంగీత ప్రియుల్ని అలరించిన ‘ఆషికీ’ (aashiqui) సిరీస్‌లో వస్తోన్న ‘ఆషికీ 3’లో ఆమెకు ఓకే అయ్యిందంటు బాలీవుడ్‌ సమాచారం. అనురాగ్‌ బసు తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో కార్తీక్‌ ఆర్యన్‌ (Kartik Aaryan) కథానాయకుడిగా నటిస్తున్నాడు. కథ రష్మికకు బాగా నచ్చడంతో గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిందట. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇటీవలే కార్తీక్‌ ఆర్యన్‌, రష్మిక (Rashmika) ఓ యాడ్‌లో కలిసి నటించారు. రష్మిక హిందీలో ‘గుడ్‌బై’, ‘మిషన్‌ మజ్ను’, ‘యానిమల్‌’ చిత్రాల్లో నటిస్తోంది.


నాన్నమ్మ బయోపిక్‌కి నేను సరిపోను!

బాలీవుడ్‌ యువ కథానాయిక సారా అలీఖాన్‌ (Sara Alikhan) సినిమా కుటుంబం నుంచి వచ్చినా తనకంటూ ప్రత్యేక శైలి ఏర్పరచుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. తొలి చిత్రం ‘కేదార్‌నాథ్‌’తోనే విజయం అందుకుంది. ఆ తర్వాత ‘సింబా’తో మరో హిట్ ఆమె ఖాతాలో పడింది. గత ఏడాది ‘అతరంగీ రే’ చిత్రంతో అందరి ప్రశంసలు అందుకుంది. ఎలాంటి పాత్రైనా పోషించడానికి సిద్ధమే అనే సారా వాళ్ల నాన్నమ్మ షర్మిల ఠాగూర్‌ బయోపిక్‌లో మాత్రం నటించనంటోంది. ‘‘నానమ్మ చాలా అందంగా ఉంటుంది. నేను అంత అందంగా ఉంటానో లేదో తెలియదు. ఆమెకున్న ప్రపంచజ్ఞానం నాకు లేదు. మా ఇద్దరి మధ్య ఎప్పుడూ నా కెరీర్‌ గురించి గానీ, నాన్నమ్మ సినీ జీవితం గురించి గానీ పెద్దగా చర్చే రాదు. ఆమెలాంటి గొప్ప నటి పాత్రలోకి వెళ్లడానికి నాకు అర్హత లేదు అనిపిస్తుంది’’అని చెప్పింది. సారా ప్రస్తుతం ‘గ్యాస్‌లైట్‌’ చిత్రంతో పాటు విక్కీ కౌశల్‌తో కలిసి ఓ సినిమాలో నటిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని