Atal Bihari Vajpayee: తెరపైకి వాజ్‌పేయీ జీవితకథ

భారత మాజీ ప్రధానమంత్రి అటల్‌ బిహారి వాజ్‌పేయీ జీవితకథ త్వరలో సినిమాగా తెరపైకి రానుంది. ప్రముఖ రచయిత ఉల్లేఖ్‌ ఎన్‌.పి రచించిన ‘ది అన్‌టోల్డ్‌ వాజ్‌పేయీ: పొలిటీషియన్‌ అండ్‌ పారడాక్స్‌’ పుస్తకాధారంగా ఈ చిత్రం రూపొందనుంది. తాజాగా ఈ పుస్తక హక్కులను దక్కించుకున్నట్లు నిర్మాతలు వినోద్‌ భానుషాలి, సం

Updated : 29 Jun 2022 08:30 IST

భారత మాజీ ప్రధానమంత్రి అటల్‌ బిహారి వాజ్‌పేయీ(Atal Bihari Vajpayee) జీవితకథ త్వరలో సినిమాగా తెరపైకి రానుంది. ప్రముఖ రచయిత ఉల్లేఖ్‌ ఎన్‌.పి రచించిన ‘ది అన్‌టోల్డ్‌ వాజ్‌పేయీ: పొలిటీషియన్‌ అండ్‌ పారడాక్స్‌’ (The Untold Vajpayee) పుస్తకాధారంగా ఈ చిత్రం రూపొందనుంది. తాజాగా ఈ పుస్తక హక్కులను దక్కించుకున్నట్లు నిర్మాతలు వినోద్‌ భానుషాలి(Vinod Bhanushali), సందీప్‌ సింగ్‌(Sundeep Singh) ప్రకటించారు. ఈ సందర్భంగా నిర్మాత వినోద్‌ మాట్లాడుతూ.. ‘‘వాజ్‌పేయీకి నేను వీరాభిమానిని. మన దేశ నిర్మాణానికి ఆయన చేసిన కృషి ఎనలేనిది. అందుకే ఆయన వారసత్వాన్ని వెండితెరపైకి తీసుకురావడాన్ని మేము గొప్ప గౌరవంగా భావిస్తున్నాం’’ అన్నారు. ‘‘భారతీయ చరిత్రలోని గొప్ప నాయకులలో అటల్‌ బిహారి వాజ్‌పేయీ ఒకరు. ఈ సినిమాలో ఆయన రాజకీయ సిద్ధాంతాలనే కాక మానవీయ, కవితా కోణాల్ని ఆవిష్కరించనున్నాం. ప్రస్తుతం వాజ్‌పేయీ పాత్ర పోషించగల నటుడి కోసం వెతుకుతున్నాం. త్వరలో ఈ చిత్ర దర్శకుడ్ని ప్రకటిస్తాం. వచ్చే ఏడాది ఆరంభంలో సినిమా సెట్స్‌పైకి వెళ్తుంది. వాజ్‌పేయీ 99వ జయంతి సందర్భంగా 2023 క్రిస్మస్‌కు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’’ అన్నారు మరో నిర్మాత సందీప్‌ సింగ్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని