‘రాంబో’ దర్శకుడు ధావన్‌?

ప్రముఖ హాలీవుడ్‌ చిత్రం ‘రాంబో’ని హిందీలో రీమేక్‌ చేయడానికి ఎప్పటి నుంచో సన్నాహాలు జరుగుతున్నాయి. హాలీవుడ్‌లో సిల్వర్‌స్టర్‌ స్టాలోన్‌ నటించిన ఆ చిత్రం

Published : 29 Aug 2020 10:55 IST

ముంబయి: ప్రముఖ హాలీవుడ్‌ చిత్రం ‘రాంబో’ని హిందీలో రీమేక్‌ చేయడానికి ఎప్పటి నుంచో సన్నాహాలు జరుగుతున్నాయి. హాలీవుడ్‌లో సిల్వర్‌స్టర్‌ స్టాలోన్‌ నటించిన ఆ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ విజయం సాధించింది. హిందీ రీమేక్‌లో టైగర్‌ ష్రాఫ్‌ నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని 2018లో షూటింగ్‌ మొదలుపెట్టి 2019లో విడుదల చేయాలనుకున్నారు. కానీ సినిమా ఆగిపోయింది. ముందు నుంచీ ఈ చిత్రానికి ‘వార్‌’ చిత్ర దర్శకుడు సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వం వహిస్తారని అనుకున్నారు. మారిన పరిస్థితుల దృష్ట్యా రోహిత్‌ ధావన్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నట్టు సమాచారం.

యశ్‌రాజ్‌ ఫిలిమ్స్‌లో షారుఖ్‌ఖాన్‌తో చేయబోయే సినిమా బిజీలో ఉన్నారు సిద్ధార్థ్‌. అందువలన రోహిత్‌ చేతికి ఈ ప్రాజెక్టు వచ్చిందని బాలీవుడ్‌ సమాచారం. రోహిత్‌ ధావన్‌ ప్రస్తుతం ‘అల వైకుంఠపురములో..’ హిందీ రీమేక్‌ను కార్తిక్‌ ఆర్యన్‌తో తెరకెక్కించే పనిలో ఉన్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలున్నాయి. ఇది పూర్తయ్యాకా వచ్చే ఏడాది చివర్లో ‘రాంబో’ హిందీ రీమేక్‌పై ధావన్‌ దృష్టిపెట్టనున్నారట. ప్రస్తుతం టైగర్‌ ష్రాఫ్‌ ‘హీరోపంటి 2’ చిత్రంలో నటిస్తున్నారు.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని