Rishab Shetty: రిషబ్‌ శెట్టితో కలిసి పనిచేయాలని ఉంది..: బాలీవుడ్‌ స్టార్‌ హీరో

కాంతార(Kantara) హీరో రిషబ్‌ శెట్టి(Rishab Shetty)పై బాలీవుడ్ ప్రముఖ నటులు ప్రశంసలు కురిపిస్తున్నారు. అతడితో కలిసి నటించాలని కోరుకుంటున్నారు. 

Published : 19 Dec 2022 12:22 IST

హైదరాబాద్‌: ఈ ఏడాది భారీ విజయాన్ని అందుకున్న సినిమాల్లో కాంతార(Kantara) ఒకటి. ఎటువంటి అంచనాలు లేకుండా మంచి హిట్‌ను అందుకొని నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. విడుదలైన అన్ని భాషల్లో సూపర్‌ హిట్‌గా నిలిచింది. దీంతో ఈ సినిమా హీరో రిషబ్‌ శెట్టి(Rishab Shetty) టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారాడు. అన్ని భాషల్లోని నటులు రిషబ్‌తో కలిసి నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇటీవల బాలీవుడ్‌ ప్రముఖ హీరో హృతిక్‌ రోషన్‌(Hrithik Roshan) కాంతార సినిమా చూసి రిషబ్‌ ప్రతిభపై ప్రశంసల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. తాజాగా బాలీవుడ్‌లోని మరో స్టార్ హీరో రిషబ్‌ను ఉద్దేశించి మాట్లాడారు. కాంతార హీరోతో కలిసి పనిచేయాలని ఉందంటూ మనసులో మాట బయటపెట్టారు.

ఇటీవల ఓ ప్రముఖ మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో అనిల్‌ కపూర్‌(Anil Kapoor), రిషబ్‌ శెట్టి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనిల్‌ కపూర్‌ ‘కాంతార’ సినిమా గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా రిషబ్‌ను పొగడ్తలతో ముంచెత్తిన అనిల్‌.. ‘తర్వాత సినిమా నాతో చేయండి’ అని కోరారు. రిషబ్‌తో కలిసి పనిచేయాలని చాలామంది బాలీవుడ్‌ నటులు కోరుకుంటున్నారు. బాలీవుడ్‌ హీరో నవాజుద్దీన్‌ సిద్ధఖీ(Nawazuddin Siddiqui) తాజాగా రిషబ్‌ శెట్టిను ప్రశంసించడంతో పాటు భవిష్యత్తులో కన్నడ చిత్ర పరిశ్రమలో పనిచేయాలని ఉందని చెప్పారు. ఇక థియేటర్లలో సంచలనం సృష్టించిన ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలో అలరిస్తోంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని