Bomma Blockbuster: అందరూ మెచ్చే.. బ్లాక్‌బస్టర్‌ బొమ్మ

నందు విజయ్‌కృష్ణ హీరోగా రాజ్‌ విరాట్‌ తెరకెక్కించిన చిత్రం ‘బొమ్మ బ్లాక్‌బస్టర్‌’. ప్రవీణ్‌ పగడాల, బోసుబాబు నిడుమోలు, ఆనంద్‌ రెడ్డి మద్ది, మనోహర్‌ రెడ్డి యెడ సంయుక్తంగా నిర్మించారు. రష్మి గౌతమ్‌ కథానాయిక.

Updated : 23 Oct 2022 13:38 IST

నందు విజయ్‌కృష్ణ (Nandu) హీరోగా రాజ్‌ విరాట్‌ తెరకెక్కించిన చిత్రం ‘బొమ్మ బ్లాక్‌బస్టర్‌’ (Bomma Blockbuster). ప్రవీణ్‌ పగడాల, బోసుబాబు నిడుమోలు, ఆనంద్‌ రెడ్డి మద్ది, మనోహర్‌ రెడ్డి యెడ సంయుక్తంగా నిర్మించారు. రష్మి గౌతమ్‌ కథానాయిక. ఈ సినిమా నవంబరు 4న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే చిత్ర ట్రైలర్‌ను దర్శకుడు మారుతి, హీరో సిద్దు జొన్నలగడ్డ ఇటీవల హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో నందు మాట్లాడుతూ.. ‘‘నన్ను నమ్మి ఈ సినిమా చేసేందుకు ముందుకొచ్చింది రష్మి. అచ్యుతాపురం అనే చిన్న ఊర్లో షూట్‌ చేశాం. ఆ సమయంలో ఓ చిన్న పూరి గుడిసెలోకి వెళ్లి బట్టలు మార్చుకునేది రష్మి. తను ఈ చిత్రం కోసం చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. సినిమాతో పాటు పాటలు చాలా బాగా వచ్చాయి’’ అన్నారు. ‘‘నన్ను నమ్మి నాకింత మంచి అవకాశం అందించిన దర్శక నిర్మాతలకు థ్యాంక్స్‌. ప్రశాంత్‌ విహారి అద్భుతమైన పాటలిచ్చారు’’ అంది నాయిక రష్మి. చిత్ర దర్శకుడు మాట్లాడుతూ.. ‘‘మంచి కంటెంట్‌తో వస్తున్న ఈ సినిమా అందరికీ కచ్చితంగా నచ్చుతుంద’’న్నారు. ‘‘నటీనటులు, సాంకేతిక నిపుణుల సహకారంతో సినిమా చాలా బాగా వచ్చింది’’ అన్నారు చిత్ర నిర్మాతలు. ఈ కార్యక్రమంలో ప్రశాంత్‌ ఆర్‌.విహారి, ఎస్‌కెఎన్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని