Bomma Blockbuster: ‘బొమ్మ బ్లాక్‌బస్టర్‌’ ట్రైలర్‌.. డైలాగ్స్‌తో అదరగొట్టేసిన నందు

‘100 % లవ్‌’తో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నందు మరోసారి వెండితెరపై అలరించేందుకు సిద్ధమయ్యారు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త చిత్రం ‘బొమ్మ బ్లాక్‌బస్టర్‌’. ఈ సినిమా ట్రైలర్‌ తాజాగా విడుదలైంది.

Published : 22 Oct 2022 13:47 IST

హైదరాబాద్‌: నందు (Nandu), రష్మీ (Rashmi Gautam) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘బొమ్మ బ్లాక్‌బస్టర్‌’ (Bomma Blockbuster). రాజ్‌ విరాట్‌ దర్శకుడు. నవంబర్‌ 4న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో శనివారం ఈ సినిమా ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. సినిమాలు, ముఖ్యంగా దర్శకుడు పూరీని ఇష్టపడే వ్యక్తిగా నందు, కొట్లాటలంటే ఆసక్తి కనబర్చే అమ్మాయిగా రష్మీ కనిపించారు. వీరిద్దరి జోడీ, వీళ్ల మధ్య వచ్చే సన్నివేశాలు యువతను ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇక ట్రైలర్‌ చివర్లో.. ‘‘ఏం చేస్తామో.. ఎట్టా చేస్తామో తెలియదు. పరిస్థితులను బట్టి గొడవ మాత్రం పెట్టుకోవాలి. అక్కడ నుంచి వాళ్లను తరిమి తరిమి.. అరటి తోటల మధ్యలో నుంచి తుఫాన్‌ బిల్డింగ్‌ దాటించి, సరిగ్గా అడ్డరోడ్డు పక్కన ఉన్న ఎత్తిపోతల పొలంలోకి తీసుకెళ్లి.. ఏ ఎకరం పొలంలో అయితే గొడవ మొదలైందో అక్కడే ముగిద్దాం’’ అంటూ నందు చెప్పిన డైలాగ్‌ మాస్‌ ప్రియుల్ని మెప్పించేలా ఉంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని