Orange: కష్టపడ్డా కానీ సక్సెస్‌ రాలేదు

రామ్‌చరణ్‌ కథానాయకుడిగా నటించిన ‘ఆరెంజ్‌’ చిత్రాన్ని తెరకెక్కించడంలో తాను ఎంతో కష్టపడ్డానని ప్రముఖ దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్‌ తెలిపారు. దర్శకుడిగా తొలి అడుగులోనే ‘బొమ్మరిల్లు’తో సూపర్‌హిట్‌ విజయాన్ని అందుకున్న ఆయన ప్రస్తుతం...

Published : 05 Jul 2021 00:59 IST

బొమ్మరిల్లు భాస్కర్‌

హైదరాబాద్: రామ్‌చరణ్‌ కథానాయకుడిగా నటించిన ‘ఆరెంజ్‌’ చిత్రాన్ని తెరకెక్కించడంలో తాను ఎంతో కష్టపడ్డానని ప్రముఖ దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్‌ తెలిపారు. దర్శకుడిగా తొలి అడుగులోనే ‘బొమ్మరిల్లు’తో సూపర్‌హిట్‌ విజయాన్ని అందుకున్న ఆయన ప్రస్తుతం అఖిల్‌ హీరోగా ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’ తెరకెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్‌ గురించి ఎన్నో ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు.

‘‘సిద్దార్థ్‌, జెనీలియా జంటగా నటించిన ‘బొమ్మరిల్లు’ సినిమాతో నేను దర్శకుడిగా తొలి అడుగువేశాను. ఆ సినిమా మంచి విజయం అందుకుంది. అలా, ఆ సినిమా పేరే మా ఇంటి పేరుగా మారింది. ఆ సినిమా విజయం అందుకున్న తర్వాత ప్రేక్షకులందరూ అదే స్థాయి సినిమాలు నా దగ్గర నుంచి కోరుకుంటారు. దాంతో  ప్రతి సినిమా విషయంలో ఎంతో టెన్షన్‌ పడ్డాను’’

‘‘ఇప్పటివరకూ నేను తెరకెక్కించిన సినిమాలకంటే కూడా ‘ఆరెంజ్‌’ కోసమే ఎక్కువగా కష్టపడ్డాను. ఆ సినిమా కథ విషయంలో మొదట ఓ లైన్‌ అనుకున్నాను. దాన్నే కథగా తీర్చిదిద్ది సినిమా చేశాను. కథలో పర్‌ఫెక్షన్‌ రావాలని రేయింబవళ్లు కూర్చొని రాస్తూనే ఉండేవాడిని. ఆ సినిమా మ్యూజికల్‌గా సూపర్‌ హిట్‌ అయ్యింది. స్టోరీ కూడా చాలామందికి నచ్చింది. అలాంటి సినిమాలు కావాలని ఇప్పటికీ నన్ను అడుగుతున్నారు.. కానీ, ఆ సినిమా విజయం సాధించకపోవడానికి కారణం నాకు తెలిసినంతవరకూ స్క్రీన్‌ప్లే సరిగ్గా కుదరకపోవడమే అనుకుంటున్నా’ అని బొమ్మరిల్లు భాస్కర్‌ వివరించారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని