Orange: రామ్ చరణ్ ‘ఆరెంజ్’ టైటిల్ వెనుక ఉన్న కథ ఇదే..
రామ్ చరణ్ (Ram Charan) హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘ఆరెంజ్’ (Orange). ఈ సినిమా టైటిల్ వెనుక ఉన్న కారణాన్ని దర్శకుడు వివరించారు.
ఇంటర్నెట్ డెస్క్: రామ్ చరణ్-జెనీలియా (Ram Charan-Genelia) జంటగా తెరకెక్కిన మోడ్రన్ లవ్‌స్టోరీ ‘ఆరెంజ్’ (Orange). యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం మ్యూజికల్ హిట్‌గా నిలిచింది. 2010లో విడుదలైన క్రేజీ లవ్ స్టోరీకి బొమ్మరిల్లు భాస్కర్ (Bommarillu Bhaskar) దర్శకత్వం వహించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఈ సినిమాకు ‘ఆరెంజ్’ అనే టైటిల్ పెట్టడం వెనుక ఉన్న కారణాన్ని వివరించారు.
‘‘ఆరెంజ్’ అనే టైటిల్ పెట్టాలనే ఆలోచన నాకే వచ్చింది. సినిమా స్టోరీకి తగినట్లు ఉంటుందని దీన్నిసెలెక్ట్ చేశాను. ప్రేమలోనూ హెచ్చు తగ్గులు ఉంటాయని నేను అనుకుంటాను. ఒక వ్యక్తిపై ప్రేమ ఎప్పుడూ ఒకేలా ఉండదు. దీనిని సూర్యోదయం, సూర్యాస్తమయంతో పోల్చాను. ఆ రెండు సమయాల్లో సూర్యుడు ఆరెంజ్ రంగులోనే ఉంటాడు. అందులో సూర్యోదయాన్ని ప్రేమ పెరగడాన్ని, సూర్యాస్తమయం ప్రేమ తగ్గడాన్ని సూచిస్తుంది. అందుకే ‘ఆరెంజ్’ అని పెట్టాను. దీని గురించి వివరంగా చెప్పగానే మా టీమ్ వాళ్లందరూ వెంటనే ఓకే చేశారు’’ అంటూ ఈ సినిమా టైటిల్ వెనుక ఉన్న కథను చెప్పారు.
మొదట ఈ సినిమాను న్యూయార్క్‌లో షూట్ చేయాలని అనుకున్నారట.. కానీ, షెడ్యూల్ సమయానికి న్యూయార్క్‌లో చలి బాగా ఉండడంతో ఆస్ట్రేలియాలోని సిడ్నీలో షూట్ చేసినట్లు చెప్పారు. మొదట ఓ లైన్ అనుకుని దాన్నే కథగా తీర్చిదిద్దినట్లు దర్శకుడు తెలిపారు. కథలో పర్‌ఫెక్షన్ రావాలని రేయింబవళ్లు కూర్చొని రాసినన్నారు. స్టోరీ చాలా మందికి నచ్చిందని కాకపోతే అనుకున్న స్థాయిలో విజయం సాధించకపోవడానికి స్క్రీన్‌ప్లే సరిగా కుదరలేదేమోనని బొమ్మరిల్లు భాస్కర్ ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక ఇటీవల రామ్‌చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ‘ఆరెంజ్’ సినిమాను రీరిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఆ రీ రిలీజ్‌కు అభిమానులు భారీగా తరలివచ్చి థియేటర్ల వద్ద ‘ఆరెంజ్’ పాటలు, డైలాగులతో సందడి చేశారు. సోషల్ మీడియాలోనూ దీనికి సంబంధించిన వీడియోలు వైరలయ్యాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Salaar: ‘సలార్’ రిలీజ్ ఆరోజేనా?.. వైరల్‌గా ప్రశాంత్ నీల్ వైఫ్ పోస్ట్
-
IND vs AUS: భారత్‌ను ఓడించిన జట్టు ప్రపంచకప్ గెలుస్తుంది: మైఖేల్ వాన్
-
Prabhas Statue: ప్రభాస్ ‘బాహుబలి’ మైనపు విగ్రహం.. నిర్మాత ఆగ్రహం..!
-
Interpol: ఖలిస్థాన్ ఉగ్రవాది కరణ్‌వీర్‌సింగ్ కోసం ఇంటర్‌పోల్ రెడ్‌కార్నర్ నోటీస్
-
Social Look: చీరలో పూజా మెరుపులు.. రకుల్ పోజులు.. దివి కవిత్వం ఎవరికోసమో తెలుసా..?
-
Black Sea: రష్యాకు ఎదురుదెబ్బ.. నౌకాదళ కమాండర్ సహా 34 మంది మృతి!