Boney Kapoor: అందుకే హిందీలో రీమేక్ చిత్రాలు హిట్‌కావట్లేదు: బోనీ కపూర్
‘‘హిందీ ప్రేక్షకుల అభిరుచి మేరకు రీమేక్ చేయాలనుకున్న స్క్రిప్టును కొంత మారిస్తే ఫలితం ఉంటుంది’’ అని నిర్మాత బోనీ కపూర్ అన్నారు. ‘మిలీ’ సినిమా ప్రచారంలో ఆయన ఈ వ్యాఖ్య చేశారు.
ముంబయి: ఓ భాషలో హిట్ అయిన సినిమాలను ఇతర భాషల్లో రీమేక్ చేయటం ఎప్పటి నుంచో ఉన్న పద్ధతే. కానీ, ఒకప్పటికీ ఇప్పటికీ పరిస్థితి మారింది. దక్షిణాది భాషల్లో విజయం సాధించిన పలు చిత్రాలను హిందీలో పునః నిర్మించగా అవి అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోతున్నాయి. ‘మిలీ’ (Mili) సినిమా ప్రచారంలో భాగంగా ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ (Boney Kapoor) ఈ విషయమై స్పందించారు. ‘జెర్సీ’ (తెలుగు), విక్రమ్ వేద (తమిళం)లను ఉదాహరణగా తీసుకుంటూ.. ‘‘ఈ రెండు సినిమాలు ఆయా భాషల్లో హిట్‌గా నిలిచాయి. వాటి రీమేక్ (హిందీ)లు మాత్రం బాక్సాఫీసు వద్ద పరాజయం పొందాయి. స్థానికతకు తగ్గట్టు ఎలాంటి మార్పులు చేయకుండా ఉన్నది ఉన్నట్టు (కాపీ- పేస్ట్) తెరకెక్కించడమే ఫెయిల్యూర్‌కు కారణం. పైగా టైటిల్‌నూ మార్చట్లేదు. హిందీ ప్రేక్షకుల అభిరుచి మేరకు స్క్రిప్టును కొంత మారిస్తే ఫలితం ఉంటుంది’’ అని బోనీ కపూర్ తెలిపారు.
తన తనయ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) ప్రధాన పాత్రలో బోనీ నిర్మించిన చిత్రమే ‘మిలీ’. సన్నీ కౌశల్, మనోజ్ పవా తదితరులు కీలక పాత్రలు పోషించారు. అనుకోని పరిస్థితుల్లో మైనస్ 18 డిగ్రీల గడ్డకట్టుకుపోయే చలిలో ఇరుక్కుపోయిన మిలీ అనే యువతి ఆ ప్రమాదం నుంచి ఎలా బయటపడింది? అనే ఆసక్తికర కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా మలయాళ చిత్రం ‘హెలెన్’కు రీమేక్. మాతృకకు దర్శకత్వం వహించిన మత్తుకుట్టి జేవియరే ‘మిలీ’కీ దర్శకుడు. నవంబరు 4న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. ఇటీవల, ‘గుడ్‌లక్ జెర్రీ’తో ప్రేక్షకులను పలకరించింది జాన్వీ. అది తమిళ సినిమా ‘కొలమావు కోకిల’ రీమేక్.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
IMA: ఆస్పత్రి డీన్‌తో టాయిలెట్లు కడిగిస్తారా? ఐఎంఏ హెచ్చరిక!
-
Nobel Prize: రసాయన శాస్త్రంలో నోబెల్ వీరికే.. ప్రకటనకు ముందే ‘లీకుల’ కలకలం..!
-
Harmilan Bains: 13 ఏళ్ల వయసులోనే నిషేధం... ఆపై వరుస గాయాలు.. హర్మిలన్ పోరాటమిదీ!
-
Meta: మెటాలో మరోసారి ఉద్యోగుల తొలగింపు..!
-
Rajeshwari Kumari: అప్పుడు తండ్రి.. ఇప్పుడు తనయ... రజత పతకధారి రాజేశ్వరి కథ ఇదీ!
-
HarishRao: మాటలు చెప్పే సర్కార్ కావాలా? చేతల సర్కార్ కావాలా?: హరీశ్‌రావు