Updated : 12 May 2022 14:55 IST

BoneyKapoor: మహేశ్‌ కామెంట్స్‌.. స్పందించడానికి నేను కరెక్ట్‌ పర్సన్‌ కాదు: బోనీ కపూర్‌

ముంబయి: బాలీవుడ్‌ గురించి సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు చేసిన వ్యాఖ్యలపై స్పందించడానికి తాను సరైన వ్యక్తిని కాదని అన్నారు ప్రముఖ నిర్మాత బోనీకపూర్‌. ఓ ఈవెంట్‌లో పాల్గొన్న మహేశ్‌.. బాలీవుడ్‌ తనని భరించలేదని.. సమయం వృథా చేసుకోనని అన్నారు. ఈ వ్యాఖ్యలు వైరల్‌గా మారడంతో బాలీవుడ్‌ అసహనంగా ఉందని పలు ఆంగ్ల పత్రికల్లో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మహేశ్‌ వ్యాఖ్యలపై స్పందించమని బోనీకపూర్‌ని ఓ ఆంగ్ల పత్రిక కోరగా.. ‘‘నేను అటు దక్షిణాదికి.. ఇటు ఉత్తరాదికి చెందినవాడిని. తమిళం, తెలుగుల్లో ఇప్పటికే ఎన్నో చిత్రాలు చేశాను. త్వరలో కన్నడ, మలయాళంలో కూడా చేయనున్నాను. కాబట్టి నేను ఈ విషయంపై ఎలాంటి కామెంట్‌ చేయలేను. మహేశ్‌ వ్యాఖ్యలపై స్పందించడానికి నేను కరెక్ట్‌ పర్సన్‌ కాదు. తనకు ఏది అనిపిస్తే అది మాట్లాడే హక్కు మహేశ్‌కి ఉంది. బాలీవుడ్‌ చిత్రపరిశ్రమ తనని భరించలేదని మహేశ్‌ అనుకుని ఉండొచ్చు. అలా చెప్పడానికి తన వద్ద తగిన కారణాలు కూడా ఉండొచ్చు. ఎవరి అభిప్రాయం వారిది. వాళ్ల ఫీలింగ్‌పై కామెంట్స్‌ చేయడానికి మనమెవరు?’’ అని బోనీ కపూర్‌ అన్నారు.

అసలేం జరిగిందంటే..

అడివి శేష్‌ ప్రధాన పాత్రలో నటించిన ‘మేజర్‌’ చిత్రానికి మహేశ్‌బాబు నిర్మాత. జూన్‌ 3న ‘మేజర్‌’ విడుదల కానుంది. ఈనేపథ్యంలో ఇటీవల ఈ సినిమా ట్రైలర్‌ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఇందులో పాల్గొన్న మహేశ్‌ని బాలీవుడ్‌ ఎంట్రీపై స్పందించమని విలేకరి కోరగా.. ‘‘బాలీవుడ్‌ నన్ను భరించలేదు. అందుకే నేను సమయాన్ని వృథా చేసుకోవాలనుకోవడం లేదు. తెలుగు వారు నాపై చూపిస్తున్న ప్రేమాభిమానాలు అమితమైనవి. ప్రస్తుతం టాలీవుడ్‌పైనే నా దృష్టి ఉంది’’ అని మహేశ్‌  అన్నారు.

Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని