Boney Kapoor: రజనీకాంత్‌తో మూవీపై బోనీకపూర్‌ ఏమన్నారంటే?

భారీ అంచనాల మధ్య విడుదలైన రజనీకాంత్‌ ‘పెద్దన్న’ పెద్దగా మెప్పించలేకపోయింది. మరోవైపు ఆయన ఆరోగ్యం కూడా సహకరించకపోవడంతో

Published : 20 Feb 2022 19:39 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భారీ అంచనాల మధ్య విడుదలైన రజనీకాంత్‌ ‘పెద్దన్న’ పెద్దగా మెప్పించలేకపోయింది. మరోవైపు ఆయన ఆరోగ్యం కూడా సహకరించకపోవడంతో సినిమాల నుంచి విరామం తీసుకుంటారని అనుకున్నారు. కానీ, అందరూ ఆశ్చర్యపోయేలా నీల్సన్‌ దిలీప్‌కుమార్‌ దర్శకత్వంలో సినిమా చేస్తున్నట్లు తలైవా ప్రకటించారు. దీంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేవు. ఈ క్రమంలో మరో వార్త సోషల్‌మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. రజనీకాంత్‌ తన 170 సినిమా బోనీకపూర్‌ నిర్మాణ సంస్థలో చేయబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో బోనీకపూర్‌  స్పందించారు. ‘ఎన్నో ఏళ్లుగా రజనీగారు నాకు స్నేహితులు. తరచూ మేము కలుస్తుంటాం. ఆలోచనలు, అభిప్రాయాలను పంచుకుంటాం. మేము కలిసి ఏదైనా సినిమా చేయాలనుకున్నప్పుడు ఆ ప్రకటన చేసే మొదటి వ్యక్తిని నేనే. ఈ విషయంలో మీకు ఎలాంటి ఊహాగాన వార్తలు ఉండవు’’ అని స్పష్టం చేశారు.

రజనీకాంత్‌ త్వరలోనే తన 169వ చిత్రం నీల్సన్‌ దిలీప్‌కుమార్‌ దర్శకత్వంలో చేయనున్నారు. సన్‌పిక్చర్స్‌ ఈ సినిమాను నిర్మించనుంది. ప్రస్తుతం నీల్సన్‌ విజయ్‌తో ‘బీస్ట్‌’ చేస్తున్నారు. మరోవైపు బోనీకపూర్‌ నిర్మించిన అజిత్‌ ‘వలిమై’ ఫిబ్రవరి 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని