Boo OTT release: నేరుగా ఓటీటీలోకి విశ్వక్‌సేన్‌, రకుల్‌ మూవీ.. ఫ్రీగా చూడొచ్చు!

విశ్వక్‌సేన్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, మోనికా, నివేదా పేతురాజ్‌, మేఘా ఆకాశ్‌, మంజిమా మోహన్‌ కీలక పాత్రల్లో నటించిన హారర్‌ మూవీ ‘బూ’.

Published : 23 May 2023 17:35 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: విశ్వక్‌సేన్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, మోనికా, నివేదా పేతురాజ్‌, మేఘా ఆకాశ్‌, మంజిమా మోహన్‌ తదితరులు కీలక పాత్రల్లో నటించిన హారర్‌ మూవీ ‘బూ’ (BOO). విజయ్‌ దర్శకుడు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ సినిమా ఎప్పుడో చిత్రీకరణ పూర్తి చేసుకుంది. అయితే అనివార్య కారణాల వల్ల థియేటర్‌లో విడుదల కాలేదు. ఇప్పుడు నేరుగా ఓటీటీలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. జియో సినిమా వేదికగా మే 27వ తేదీ నుంచి ‘బూ’ స్ట్రీమింగ్‌ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ జియో సినిమా టీజర్‌ను విడుదల చేసింది. ‘మీకు ఎక్కిళ్లు వస్తే మంచినీళ్ల కోసం చూడకండి. ఒకసారి చుట్టూ చూడండి. మీ పక్కనే దెయ్యం ఉండే అవకాశం ఉంది’ అని జియో స్టూడియోస్‌ పేర్కొంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని