Waltair Veerayya: పాటెలా ఉంది తమ్ముడూ!

వీరయ్యతో కలిసి వీరమల్లు సందడి చేశారు. అటు అన్న చిరంజీవి నటిస్తున్న ‘వాల్తేరు వీరయ్య’, ఇటు తమ్ముడు పవన్‌కల్యాణ్‌ నటిస్తున్న ‘హరి హర వీర మల్లు’. ఈ రెండు సినిమాలూ హైదరాబాద్‌లో పక్కపక్కనే చిత్రీకరణ జరుపుకొంటున్నాయి.

Updated : 23 Nov 2022 07:14 IST

వీరయ్యతో కలిసి వీరమల్లు సందడి చేశారు. అటు అన్న చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya), ఇటు తమ్ముడు పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) నటిస్తున్న ‘హరి హర వీర మల్లు’ (Hari Hara Veera Mallu). ఈ రెండు సినిమాలూ హైదరాబాద్‌లో పక్కపక్కనే చిత్రీకరణ జరుపుకొంటున్నాయి. అది తెలిసి పవన్‌కల్యాణ్‌ తన అన్నయ్య నటిస్తున్న ‘వాల్తేరు వీరయ్య’ సెట్‌కి వెళ్లారు. చిత్రీకరణలో ఉన్న చిరంజీవితోనూ, చిత్రబృందంతోనూ కలిసి ముచ్చటించారు. త్వరలోనే విడుదల కానున్న ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలోని ‘బాస్‌ పార్టీ... ’ పాటని పవన్‌కల్యాణ్‌కి స్వయంగా చూపించారు చిరంజీవి. ఆ సందర్భంలోని చిత్రమే ఇది. ఫొటో చూస్తుంటే... ‘పాటెలా ఉంది తమ్ముడూ’ అని చిరంజీవి అడుగుతున్నట్టే ఉంది కదూ! పాట పవన్‌కల్యాణ్‌కి చాలా నచ్చిందని ‘వాల్తేరు వీరయ్య’ని తెరకెక్కిస్తున్న దర్శకుడు బాబీ తెలిపారు. అన్నదమ్ముల ఆనందాన్ని చూసి మురిసిపోతున్నారు ‘హరి హర వీరమల్లు’ నిర్మాత ఎ.ఎమ్‌.రత్నం, దర్శకులు క్రిష్‌, బాబీ.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు