Cinema News: కరీనాకు ఆ అర్హత లేదు

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌, బేబో కరీనాకపూర్‌పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘బాయ్‌కాట్‌ కరీనాఖాన్‌’ అనే హాష్‌ట్యాగ్‌ని జోడించి ఆమెకు వ్యతిరేకంగా ట్వీట్లు పెడుతున్నారు....

Published : 13 Jun 2021 01:07 IST

బేబో హై డిమాండ్‌.. నెటిజన్లు ఫైర్‌

ముంబయి: బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌, బేబో కరీనాకపూర్‌పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘బాయ్‌కాట్‌ కరీనాఖాన్‌’ అనే హాష్‌ట్యాగ్‌ని జోడించి ఆమెకు వ్యతిరేకంగా ట్వీట్లు పెడుతున్నారు. బాలీవుడ్‌లో తెరకెక్కనున్న ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్ట్‌ ‘సీత’ కోసం కరీనా భారీ మొత్తంలో రెమ్యునరేషన్‌ డిమాండ్‌ చేయడమే నెటిజన్ల ఆగ్రహానికి కారణం.

బాలీవుడ్‌ దర్శకుడు అలౌకిక్‌ దేశాయ్‌ దర్శకత్వంలో ‘సీత’ ప్రాజెక్ట్‌ తెరకెక్కనుంది. ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్‌ ఈ చిత్రానికి కథ అందించనున్నారట. సీతాదేవి కోణంలో రామాయణాన్ని ఈ చిత్రం ద్వారా ఆవిష్కరించనున్నారట. అయితే, ఈ సినిమాలో సీత పాత్రకు కరీనాకపూర్ ఖాన్‌ అయితే న్యాయం చేయగలుగుతుందని భావించిన చిత్రబృందం ఆమెను సంప్రదించగా.. ఈ అమ్మడు ఏకంగా రూ.12 కోట్లు ఇస్తే ప్రాజెక్ట్‌ చేస్తా అని షరతు పెట్టినట్లు బీటౌన్‌లో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ నేపథ్యంలో సదరు వార్తలపై స్పందించిన నెటిజన్లు.. ‘తోటి నటీనటులను, అభిమానులను చులకనగా చూస్తూ.. ఎదుటివాళ్లకి అస్సలు గౌరవమివ్వని ఆమెకు సీత పాత్ర పోషించే అర్హత లేదు’, ‘‘సీతాదేవి పాత్రలో నటించాలంటే రాసి పెట్టి ఉండాలి. ఇలాంటి గొప్ప ప్రాజెక్ట్‌ని కూడా క్యాష్‌ చేసుకోవాలని చూసే కరీనాకు ‘సీత’ సినిమాలో నటించే అర్హత లేదు’’ అంటూ వరుస ట్వీట్లు చేస్తున్నారు. దీంతో ‘బాయ్‌కాట్‌ కరీనాకఖాన్‌’ ట్విటర్‌ ట్రెండింగ్‌లో దూసుకెళ్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని