Boyfriend For Hire: నేను కాదు.. నా పాత్ర గుర్తుండాలి!

‘‘మంచి ప్రేమకథతో తెరకెక్కిన చిత్రం ‘బాయ్‌ఫ్రెండ్‌ ఫర్‌ హైర్‌’. చక్కటి వినోదంతో నిండి ఉంటుంది’’ అన్నారు విశ్వంత్‌ దుద్దుంపూడి. ఆయన.. మాళవిక సతీషన్‌ జంటగా సంతోష్‌ కంభంపాటి తెరకెక్కించిన చిత్రమే ‘బాయ్‌ఫ్రెండ్‌ ఫర్‌ హైర్‌’. శుక్రవారం విడుదలవుతోంది.

Updated : 14 Oct 2022 07:32 IST

‘‘మంచి ప్రేమకథతో తెరకెక్కిన చిత్రం ‘బాయ్‌ఫ్రెండ్‌ ఫర్‌ హైర్‌’ (Boyfriend For Hire). చక్కటి వినోదంతో నిండి ఉంటుంది’’ అన్నారు విశ్వంత్‌ దుద్దుంపూడి (Viswant). ఆయన.. మాళవిక సతీషన్‌ జంటగా సంతోష్‌ కంభంపాటి తెరకెక్కించిన చిత్రమే ‘బాయ్‌ఫ్రెండ్‌ ఫర్‌ హైర్‌’. శుక్రవారం విడుదలవుతోంది. ఈ నేపథ్యంలోనే గురువారం హైదరాబాద్‌లో విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకున్నారు విశ్వంత్‌.

‘‘తొలిసారి నా కంఫర్ట్‌ జోన్‌ దాటి ఈ చిత్రం చేశా. టైటిల్‌ చూసి చాలా మంది దీన్ని బోల్డ్‌ ఫిల్మ్‌ అనుకుంటున్నారు. దీంట్లో కొత్తదనం నిండిన కథ ఉంది తప్పితే.. బోల్డ్‌ చిత్రం కాదు. భావోద్వేగాలు నిండిన చక్కటి ప్రేమకథా చిత్రమిది. ఓ వినోదాత్మక సినిమా తీయాలన్న ఉద్దేశంతో చేసిన ప్రయత్నమిది. సమాజంలో జరుగుతున్న దాన్నే వినోదాత్మకంగా చూపించాం’’.

* ‘‘ఈ చిత్రంలో పెళ్లి గురించి ప్రస్తావించాం. పెద్దలు కుదిర్చిన పెళ్లిలో ఇద్దరి మధ్య ఎలాంటి అర్థం చేసుకునే గుణం ఉండాలన్నది ఆసక్తికరంగా చూపించాం. యువతరానికి నచ్చే సినిమా ఇది. దీంట్లో నేను పోషించిన పాత్ర నా నిజ జీవితానికి చాలా దగ్గరగా ఉంటుంది. సినిమాలో హీరోలాగే నాకూ కాస్త సిగ్గు, మొహమాటం ఎక్కువే’’.

* ‘‘నేను కథల్ని నమ్ముతాను. మనకంటే సినిమా గొప్పది. ఒక సినిమా చేశాక అందులో నేను కాదు.. నా పాత్ర గుర్తుండాలి. అలాంటి పాత్రలు చేయడానికి ఇష్టపడతాను. హారర్‌ తప్ప మిగతా అన్ని జానర్స్‌ చేస్తా. గౌరవప్రదమైన సినిమాలు చేయాలని ఉంది. ప్రస్తుతం రామ్‌చరణ్‌ - శంకర్‌ల సినిమాలో నటిస్తున్నా. ‘కథ వెనుక కథ’ అనే చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ‘నమో’, ‘కాదల్‌’ అనే సినిమాలు చేస్తున్నా’’.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని