Malavika Satishan: రాజమౌళి చిత్రంలో నటించాలని కల

‘‘వైవిధ్యభరితమైన కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘బాయ్‌ఫ్రెండ్‌ ఫర్‌ హైర్‌’. ఎలాంటి అసభ్యతకు తావు లేకుండా చాలా క్లీన్‌గా ఉంటుంది సినిమా’’ అంది మాళవిక సతీషన్‌.

Updated : 09 Oct 2022 13:12 IST

‘‘వైవిధ్యభరితమైన కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘బాయ్‌ఫ్రెండ్‌ ఫర్‌ హైర్‌’ (BoyFriend For Hire). ఎలాంటి అసభ్యతకు తావు లేకుండా చాలా క్లీన్‌గా ఉంటుంది సినిమా’’ అంది మాళవిక సతీషన్‌ (Malavika Satishan). ఆమె.. విశ్వంత్‌ జంటగా నటించిన ఈ చిత్రాన్ని సంతోష్‌ కంభంపాటి తెరకెక్కించారు. వేణుమాధవ్‌ పెద్ది, కె.నిరంజన్‌ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా ఈనెల 14న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే శనివారం హైదరాబాద్‌లో విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకుంది మాళవిక.

* ‘‘టైటిల్‌ చూసి ఇది చాలా బోల్డ్‌ ఫిల్మ్‌ అనుకుంటారు కానీ, ఇది చాలా క్లీన్‌ సినిమా. నేనిందులో దివ్య అనే పాత్రలో కనిపిస్తా’’.
* ‘‘మామూలుగా సినిమాల్లో అమ్మాయి వెనక అబ్బాయి తిరుగుతాడు. కానీ, ఇందులో అమ్మాయే అబ్బాయి చుట్టూ తిరుగుతుంది’’.
* ‘‘నటిగా అన్ని రకాల పాత్రలు చేయాలనుంది. రాజమౌళి సినిమాలో నటించాలని కల. శివ నాగేశ్వరరావు దర్శకత్వంలో ‘దోచేవారెవరురా’లో నటిస్తున్నా. సూపర్‌ గుడ్‌ ఫిలిమ్స్‌లో ఓ సినిమా చేస్తున్నా’’.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు