Brahmanandam: వరదరాజుగా...

తరుణ్‌ భాస్కర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కీడా కోలా’(Keeda Cola). విజి సైన్మా పతాకంపై భరత్‌ కుమార్‌, శ్రీపాద నందిరాజ్‌, ఉపేంద్ర వర్మ, శ్రీనివాస్‌ కౌశిక్‌, సాయికృష్ణ గద్వాల్‌, విజయ్‌ కుమార్‌ నిర్మిస్తున్నారు.

Updated : 02 Feb 2023 07:19 IST

రుణ్‌ భాస్కర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కీడా కోలా’ (Keeda Cola). విజి సైన్మా పతాకంపై భరత్‌ కుమార్‌, శ్రీపాద నందిరాజ్‌, ఉపేంద్ర వర్మ, శ్రీనివాస్‌ కౌశిక్‌, సాయికృష్ణ గద్వాల్‌, విజయ్‌ కుమార్‌ నిర్మిస్తున్నారు. ఎనిమిది ప్రధాన పాత్రల చుట్టూ సాగే ఈ చిత్రంలో ప్రముఖ నటుడు బ్రహ్మానందం (Brahmanandam) ఓ కీలక పాత్రని పోషిస్తున్నారు. ప్రతి ఒక్కరికీ వాళ్ల తాతని గుర్తు చేసేలా... వరదరాజు పాత్రలో కనిపిస్తారని, ఇదివరకు చూడని ఓ సరికొత్త అవతారంలో ఆయన సందడి చేస్తారని సినీవర్గాలు తెలిపాయి. బ్రహ్మానందం పుట్టినరోజు సందర్భంగా బుధవారం ఈ సినిమాలోని ఆయన లుక్‌ని విడుదల చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని