Brahmanandam: కమల్ హాసన్ వాయిస్‌ను ఇమిటేట్ చేసిన బ్రహ్మానందం.. వీడియో వైరల్‌

కమల్ హాసన్‌ వాయిస్‌ను బ్రహ్మానందం ఇమిటేట్‌ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది.

Updated : 08 Jul 2024 15:38 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తన హాస్యం, నటనతో అందరినీ నవ్వించే బ్రహ్మానందంలో ఉన్న మరో టాలెంట్‌కు ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. ఆయన (Brahmanandam) మిమిక్రీ చూసి ఆశ్చర్యపోతున్నారు. తాజాగా జరిగిన ‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో కమల్‌ హాసన్‌ (Kamal Haasan) ఎదురుగానే బ్రహ్మానందం ఆయన్ని ఇమిటేట్‌ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది. స్పీచ్‌ ఇవ్వడం కోసం స్టేజ్‌ ఎక్కిన బ్రహ్మానందం.. కమల్‌హాసన్‌లా మాట్లాడారు. ‘‘భారతీయుడు’ మొదటి భాగాన్ని హిట్‌ చేశారు. ఇప్పుడు రెండో పార్ట్‌తో సిద్ధమయ్యాను. ఈ సినిమా కోసం ఎక్కువ కష్టపడ్డాను. దక్షిణాది ప్రేక్షకులు నన్నెంతో ఆదరిస్తున్నారు. నాకు సంతోషంతో మాటలు రావడం లేదు. ఈ సినిమాను మీరంతా ఆదరిస్తే ఇంకాస్త సంతోషిస్తా. మీ కమల్ హాసన్‌’ అని ఆయనలా మాట్లాడారు. ఈ స్పీచ్‌కు అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. కమల్‌ హాసన్‌ కూడా ఎంజాయ్‌ చేశారు. ఆ వీడియో మీరూ చూసేయండి..


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు