Brahmanandam: తెలుగు సినీ పరిశ్రమకు బ్రహ్మానందం విన్నపం

ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం తన మదిలోని మాటను అభ్యర్ధన రూపంలో తెలుగు సినీ పరిశ్రమకు తెలియజేశారు. వెంకటేశ్‌, వరుణ్‌ తేజ్‌ నటించిన ఫన్‌ఫుల్‌ మూవీ ‘ఎఫ్‌-3’. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన....

Published : 05 Jun 2022 02:21 IST

హైదరాబాద్‌: వెంకటేశ్‌, వరుణ్‌ తేజ్‌ నటించిన ఫన్‌ఫుల్‌ మూవీ ‘ఎఫ్‌-3’. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా వేసవి కానుకగా మే 27న విడుదలై థియేటర్లలో నవ్వుల వర్షం కురిపిస్తోంది. ‘ఎఫ్‌-3’ విజయం సాధించిన నేపథ్యంలో చిత్రబృందంతో హాస్యనటుడు బ్రహ్మానందం స్పెషల్‌ చిట్‌చాట్‌ నిర్వహించారు. వెంకటేశ్‌, వరుణ్‌తేజ్‌, అలీ, అనిల్‌ రావిపూడి ఈ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ‘ఎఫ్‌-3’ సినిమాలో కామెడీ టైమింగ్‌ చాలా బాగుందని, రేచీకటి ఉన్న వ్యక్తిగా వెంకటేశ్‌, నత్తి ఉన్న అబ్బాయిగా వరుణ్‌ తేజ్‌ అదరగొట్టేశారని బ్రహ్మానందం అన్నారు. సినిమాలోని కామెడీకి ప్రేక్షకులందరూ కడుపుబ్బా నవ్వుకుంటున్నారని తెలిపారు.

‘‘ఎఫ్‌-3’ సినిమాలో వెంకటేశ్‌, వరుణ్‌ తేజ్‌.. కామెడీ టైమింగ్ నాకు బాగా నచ్చింది. సాధారణంగానే వెంకటేశ్‌ దర్శకుల నటుడు. దర్శకుడు ఏం చెప్పినా సరే ఆయన ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా చేస్తుంటారు. ఆయన కామెడీ టైమింగ్‌ని మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం. వరుణ్‌ తేజ్‌ బయట ఎక్కువగా మాట్లాడడు. అలాంటి కుర్రాడిచేత నత్తి ఉన్న వ్యక్తిగా అనిల్‌ మాంచి కామెడీ అందించారు. అలీ, రాజేంద్రప్రసాద్‌, రఘుబాబు.. ఇలా చెప్పుకుంటూ వెళితే ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరూ తమ యాక్టింగ్‌తో నవ్వులు పూయించారు. తెలుగులో ఉన్నంత మంది కమెడియన్స్‌ ఇంకా ఏ దక్షిణాది చిత్ర పరిశ్రమలోనూ లేరు. తెలుగు చిత్రపరిశ్రమకు నా విన్నపం ఏమిటంటే.. కమెడియన్స్‌ లేకపోయినా పర్వాలేదు కానీ సినిమాలో కామెడీ ఉంచండి’’ అని బ్రహ్మానందం విన్నవించారు. ‘‘ఈ సినిమాలో చేయమని అనిల్‌ నన్ను అడిగారు. కాకపోతే కరోనా పరిస్థితుల కారణంగా నేను ఇందులో భాగం లేకపోయాను’’అని చెప్పుకొచ్చారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని