Brahmanandam: ‘రానా నాయుడు’లో వెంకటేశ్‌ పాత్ర నేను చేయాల్సింది: బ్రహ్మానందం

Rana Naidu: ‘రానా నాయుడు’ప్రమోషన్స్‌లో భాగంగా బ్రహ్మానందం నటించిన వీడియో నవ్వులు పూయిస్తోంది.

Published : 12 Mar 2023 17:38 IST

హైదరాబాద్‌: ‘రానానాయుడు’లో (Rana Naidu) వెంకటేశ్‌ (Venkatesh) పోషించిన తండ్రి పాత్రకు తన ఏజ్‌ సరిపోలేదని దీంతో ఆయన్ను పెట్టుకున్నారని సీనియర్‌ నటుడు బ్రహ్మానందం (Brahmanandam) అన్నారు. ఆ పాత్ర కోసం ఆడిషన్స్‌ కూడా చేసినట్లు చెప్పారు. ఈ సిరీస్‌లో వాళ్లు ఎలా నటించారో తానూ చూస్తానని చెప్పుకొచ్చారు. రానా (Rana), వెంకటేశ్‌ (Venkatesh) కీలక పాత్రల్లో నటించిన వెబ్‌సిరీస్‌ ‘రానానాయుడు’. ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్‌ అవుతోంది. సిరీస్‌ ప్రమోషన్‌లో భాగంగా బ్రహ్మానందం నటించిన స్పెషల్‌ వీడియోను నెట్‌ఫ్లిక్స్‌ పంచుకుంది. ఆస్కార్‌నాయుడిగా ఎంట్రీ ఇచ్చిన బ్రహ్మానందం ఇచ్చిన ఆడిషన్స్‌ నవ్వులు పూయించాయి. కిరిటీ దామరాజు, జబర్దస్త్‌ అవినాష్‌లు ఇందులో కనిపించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని