Brahmanandam: బ్రహ్మానందం ఇంట ఆనందం.. మరోసారి తండ్రైన గౌతమ్‌

బ్రహ్మానందం తనయుడు రాజాగౌతమ్‌ అభిమానులకు శుభవార్త వినిపించారు. సంతోషం రెట్టింపు అయిందని పోస్ట్‌ పెట్టారు.

Published : 28 Nov 2022 01:47 IST

హైదరాబాద్‌: ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం (Brahmanandam) ఇంట ఆనందం వెల్లివిరిసింది. ఆయన తనయుడు, నటుడు రాజాగౌతమ్‌ (Raja Goutham) దంపతులకు పండంటి ఆడశిశువు జన్మించింది. ఇదే విషయాన్ని వెల్లడిస్తూ సోషల్‌ మీడియా వేదికగా గౌతమ్‌ తన సంతోషాన్ని పంచుకున్నారు.  ఈ సందర్భంగా ఓ ఫొటోను షేర్‌ చేశారు. అందులో.. గౌతమ్‌ తనయుడు తన సోదరిని ప్రేమగా చూస్తూ కనిపించాడు. దీన్ని చూసిన అభిమానులు, నెటిజన్లు, పలువురు సినీ ప్రముఖులు గౌతమ్‌కు కంగ్రాట్స్‌ చెబుతున్నారు. ‘పల్లకిలో పెళ్లికూతురు’ సినిమాతో తెరంగేట్రం చేసిన గౌతమ్‌.. ‘బసంతి’, ‘మను’, ‘చారుశీల’ వంటి విభిన్న కథా చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని