Brahmastra: ‘బ్రహ్మాస్త్రం’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్ రద్దు

రామోజీ ఫిలిం సిటీ వేదికగా శుక్రవారం సాయంత్రం జరగాల్సిన ‘బ్రహ్మాస్త్రం’ చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ రద్దైంది.

Updated : 02 Sep 2022 18:45 IST

హైదరాబాద్‌: రామోజీ ఫిల్మ్‌సిటీ వేదికగా శుక్రవారం సాయంత్రం జరగాల్సిన ‘బ్రహ్మాస్త్రం’ చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ రద్దైంది. అనివార్య కారణంగా వేడుక రద్దైనట్లు చిత్ర బృందం సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించింది. రాత్రి 8 గంటలకు పార్క్‌ హయత్‌లో చిత్ర బృందం మీడియా సమావేశం నిర్వహించనుంది. ఇందులో చిత్ర నటీనటులు, దర్శకుడు రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్ పాల్గొననున్నారు.

ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కు ఎన్టీఆర్‌ ముఖ్య అతిథిగా హాజరుకానున్న నేపథ్యంలో చిత్ర బృందం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. సినీ, ఎన్టీఆర్‌ అభిమానులు పెద్ద సంఖ్యలో వేదికకు చేరుకున్నారు. ఇప్పుడీ అనూహ్య ప్రకటనతో వారంతా నిరుత్సాహానికి గురయ్యారు. రణ్‌బీర్‌ కపూర్‌, అలియా భట్‌ ప్రధాన పాత్రల్లో దర్శకుడు అయాన్‌ ముఖర్జీ రూపొందించిన చిత్రమిది. నాగార్జున, అమితాబ్‌ బచ్చన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ సినిమాను తెలుగులో దర్శకుడు రాజమౌళి సమర్పిస్తున్నారు. ఈ నెల 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని