Chiranjeevi: బ్రిటిష్‌ డిప్యూటీ హైకమిషనర్‌తో చిరంజీవి చర్చ.. ఆవకాయ్‌ రుచి చూపించి!

బ్రిటిష్‌ డిప్యూటీ హైకమిషనర్‌ గారెత్‌కు ఆవకాయ్‌ రుచి చూపించాయని అన్నారు ప్రముఖ నటుడు చిరంజీవి. 

Published : 02 Nov 2022 01:23 IST

హైదరాబాద్‌: బ్రిటిష్‌ డిప్యూటీ హైకమిషనర్‌ (హైదరాబాద్‌) గారెత్‌ విన్‌ ఓవెన్‌ (Gareth Wynn Owen)తో ప్రముఖ నటుడు చిరంజీవి (Chiranjeevi) భేటీ అయ్యారు. యూకే- భారత్‌ల మధ్య వ్యవహారాలు, రెండు తెలుగు రాష్ట్రాల గురించి ముచ్చటించారు. దీనికి చిరంజీవి నివాసం వేదికైంది. చర్చల అనంతరం ఇద్దరూ ట్విటర్‌ ద్వారా తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ‘‘బ్రిటిష్ డిప్యూటీ కొత్త హైకమిషనర్‌ గారెత్‌ను కలవడం సంతోషంగా ఉంది. భోజనం చేస్తూ పలు అంశాల గురించి మాట్లాడుకున్నాం. ఆవకాయ్‌ సహా మన సంప్రదాయ వంటలను ఆయనకు రుచి చూపించా’’ అని చిరంజీవి తెలిపారు. గారెత్‌.. చిరుకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ‘‘నా జీవితాంతం ఈ సాయంత్రాన్ని గుర్తుపెట్టుకుంటా. మీ రక్తదాన కేంద్రాల్లోని ఒక దాంట్లో మిమ్మల్ని కలిసేందుకు ఎదురుచూస్తున్నా’’ అని చెప్పారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమ గురించి చర్చించామని, ఎన్నో ఏళ్లుగా సేవా కార్యక్రమాల చేస్తున్న చిరంజీవి అభినందించానని గారెత్‌ మరో ట్వీట్‌లో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని