BTS: ‘బీటీఎస్‌’ సింగర్‌ నోట.. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ పాట

‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో రామ్‌చరణ్‌ (Ram Charan), ఎన్టీఆర్‌ (NTR) కలిసి డ్యాన్స్‌ చేసిన నాటు నాటుకు విశేష ప్రేక్షకాదరణ సొంతమైన విషయం తెలిసిందే.

Updated : 04 Mar 2023 11:27 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ‘నాటు నాటు’ (Naatu Naatu) ఫీవర్‌ కనిపిస్తోంది. మన దేశంతోపాటు హాలీవుడ్‌(Hollywood)లోనూ ఈ పాటకు ఫ్యాన్స్‌ ఉన్నారు. ఇప్పుడిదే జాబితాలోకి దక్షిణ కొరియా మ్యూజిక్‌ బ్యాండ్‌ ‘బీటీఎస్‌’ (BTS) సింగర్‌ జంగ్‌కుక్‌ (Jungkook) వచ్చి చేరారు. ఇటీవల అభిమానులతో లైవ్‌ నిర్వహించిన జంగ్‌కుక్‌.. ‘నాటు నాటు’ పాటను ఎంజాయ్‌ చేస్తూ కనిపించారు. సీటులో కూర్చొనే ఆ పాటకు సరదాగా స్టెప్పులు వేశారు.

దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ బృందం తాజాగా స్పందించింది. ‘‘జంగ్‌కుక్‌... ఈ పాటను నువ్వు ఇంతలా ప్రేమిస్తున్నావని తెలుసుకోవడం.. చాలా సంతోషంగా ఉంది. మీకు, బీటీఎస్‌ బృందం, దక్షిణ కొరియా మొత్తానికి టన్నుల కొద్దీ ప్రేమాభిమానాన్ని పంపిస్తున్నాం’’ అని ‘ఆర్‌ఆర్‌ఆర్‌’  టీమ్‌ పేర్కొంది. మరోవైపు, ‘నాటు నాటు’ పాట ‘ఆస్కార్‌’ (Oscars)కు నామినేట్‌ అయిన విషయం తెలిసిందే. ఉత్తమ ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో దీనికి అకాడమీ అవార్డు వచ్చే అవకాశం ఉందని సినీ ప్రియులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

‘బీటీఎస్‌’ విషయానికి వస్తే.. దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ మ్యూజిక్‌ బ్యాండ్‌ ఇది. జంగ్‌కుక్‌, ఆర్‌ఎం, వి, జిమిన్‌, జిన్‌, జె.హోప్‌, సుగా.. ఇలా ఏడుగురు సభ్యులతో ఈ బ్యాండ్‌ కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా మిలియన్లలో దీనికి అభిమానులు ఉన్నారు. వీరి నుంచి వచ్చిన ‘ఫేక్‌ లవ్‌’, ‘బాయ్‌ విత్‌ లవ్‌’, ‘బటర్‌’ సాంగ్స్‌ విశేష ప్రేక్షకాదరణ సొంతం చేసుకున్నాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని