
NTR: ఎన్టీఆర్ కోసం బుచ్చిబాబు ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందేనా?
ఇంటర్నెట్‌డెస్క్: ‘ఆర్ఆర్ఆర్’(RRR) తర్వాత ఎన్టీఆర్ చేయబోయే సినిమాలపై స్పష్టత వచ్చేసింది. తారక్ పుట్టినరోజు సందర్భంగా కొరటాల శివ, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమాలు చేస్తున్నట్లు ప్రకటనలు వచ్చాయి. అయితే, బుచ్చిబాబు దర్శకత్వంలోనూ ఓ సినిమా ఉంటుందని గతంలో టాక్ వినిపించింది. పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రకటన ఉంటుందని అందరూ ఆశించారు. కానీ, అలాంటిదేమీ లేదు. తొలి చిత్రం ‘ఉప్పెన’తోనే విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న బుచ్చిబాబు ఎన్టీఆర్‌కు కథ చెప్పారని టాక్. స్పోర్ట్స్ డ్రామాగా సినిమా ఉంటుందని కూడా చెప్పుకొన్నారు. తాజాగా ప్రకటనలు చూస్తే ఈ సినిమా ఇప్పట్లో లేనట్లే. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కే ఎన్టీఆర్ 30వ సినిమా జులై నుంచి సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయి. ఈ ఏడాది చివరి నాటికి షూటింగ్ పూర్తయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ సినిమాలో ఎన్టీఆర్ నటించనున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
BJP: తొలిరోజు రాజకీయ, ఆర్థిక తీర్మానాలపై చర్చించిన భాజపా జాతీయ కార్యవర్గం
-
General News
TS corona: తెలంగాణలో 500 దాటిన కరోనా కేసులు
-
General News
Health Tips:అధిక రక్తపోటుతో కిడ్నీలకు ముప్పు..నివారణ ఎలాగో తెలుసా..?
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
World News
Ship: రెండు ముక్కలైన నౌక.. 24 మందికిపైగా సిబ్బంది గల్లంతు!
-
Business News
D Mart: అదరగొట్టిన డీమార్ట్.. క్యూ1లో ఆదాయం డబుల్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- చిన్న బడ్జెట్.. సొంత గూడు
- IND vs ENG: జడేజా సెంచరీ.. బుమ్రా సంచలనం.. టీమ్ఇండియా భారీ స్కోర్
- Vishal: కుప్పంలో చంద్రబాబుపై పోటీ .. నటుడు విశాల్ క్లారిటీ!
- Russia: ముప్పేట దాడులు తాళలేకే?.. స్నేక్ ఐలాండ్‌ను విడిచిన రష్యా
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (02-07-2022)
- తెదేపాలో చేరితే రూ.30 కోట్లు ఇస్తామన్నారు
- Rishabh Pant : అతనే.. ఆపద్బాంధవుడు
- Viral video: వారెవ్వా.. ఏం టాలెంట్.. మహిళకు నెటిజన్ల ప్రశంసలు!
- Rishabh pant : విమర్శలకు బెదరని నయా ‘వీరు’డు.. రిషభ్ పంత్
- Acharya: ‘ఆచార్య’ టైటిల్ కరెక్ట్ కాదు.. రామ్‌చరణ్ ఆ రోల్ చేయకపోతే బాగుండేది: పరుచూరి గోపాలకృష్ణ