BujjiIlaRaa: ధన్‌రాజ్‌లో మరో కోణం చూశా

సునీల్‌, ధన్‌రాజ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘బుజ్జీ... ఇలా రా’. చాందిని అయ్యంగార్‌ కథానాయిక. ‘గరుడవేగ’ అంజి దర్శకత్వం వహిస్తున్నారు. అగ్రహారం నాగిరెడ్డి, సంజీవరెడ్డి నిర్మాతలు. రూపా జగదీశ్‌ సమర్పిస్తున్నారు.

Updated : 07 Dec 2022 22:10 IST

సునీల్‌, ధన్‌రాజ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘బుజ్జీ... ఇలా రా’. చాందిని అయ్యంగార్‌ కథానాయిక. ‘గరుడవేగ’ అంజి దర్శకత్వం వహిస్తున్నారు. అగ్రహారం నాగిరెడ్డి, సంజీవరెడ్డి నిర్మాతలు. రూపా జగదీశ్‌ సమర్పిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ సోమవారం హైదరాబాద్‌లో విడుదలైంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో దర్శకుడు జి.నాగేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ ‘‘ధన్‌రాజ్‌ నేను కలిసి చాలా సినిమాలు చేశాం. కమెడియన్‌గా కంటే కూడా, ఆయనలోని  మరో కోణాన్ని చూశా. అందుకే అతనికి ఓ కథని పంపించా. అదే ‘బుజ్జీ.. ఇలారా’ రూపంలో తెరకెక్కింది’’ అన్నారు. ధన్‌రాజ్‌ మాట్లాడుతూ ‘‘ఈ సినిమాతో కొత్త ధన్‌రాజ్‌ని చూస్తార’’న్నారు. కార్యక్రమంలో కోన వెంకట్‌, బి.వి.ఎస్‌.రవి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని