Bullet song: వారియర్‌ వారి ‘బుల్లెట్టు’ పాట.. ఫుల్‌ వీడియో చూశారా!

‘ది వారియర్‌’ సినిమాలోని ‘బుల్లెట్టు’ పాట ఫుల్‌ వీడియో విడుదలైంది. రామ్‌, కృతి శెట్టి డ్యాన్స్‌ ఎలా ఉందో చూడండి...

Updated : 07 Dec 2022 18:51 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొన్ని పాటలు లిరికల్‌ వీడియోలతోనే శ్రోతల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటాయి. అలాంటి ఓ గీతమే ‘కమాన్‌ బేబీ లెట్స్‌ గో ఆన్‌ ఆది బుల్లెట్టు’ (Bullet). ‘ది వారియర్’ (The Warriorr) సినిమాలోని పాట ఇది. శుక్రవారం ఫుల్‌ వీడియో విడుదలైంది. హీరోహీరోయిన్లు రామ్‌ (Ram Pothineni), కృతిశెట్టిల (Krithi Shetty) హుషారైన డ్యాన్స్‌, కలర్‌ఫుల్‌ సెట్స్‌ అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి.  శ్రీమణి రాసిన ఈ పాటని శింబు, హరిప్రియ ఆలపించారు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలందించారు. రామ్‌ హీరోగా కోలీవుడ్‌ దర్శకుడు లింగుస్వామి తెరకెక్కించిన సినిమా ఇది. ఇందులో రామ్‌ పోలీసు అధికారిగా నటించగా ఆది పినిశెట్టి ప్రతినాయకుడిగా కనిపించారు. పవర్‌ఫుల్‌ యాక్షన్‌ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ఇటీవల థియేటర్లలో విడుదలై సందడి చేసింది. ఆగస్టు 11 నుంచి ఓటీటీ ‘డిస్నీ+ హాట్‌స్టార్‌’లో (Disney+ Hotstar) స్ట్రీమింగ్‌ కానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని