Bullet Song: నయా ‘బుల్లెట్టు’తో ఉర్రూతలూగిస్తున్న ‘వారియర్‌’.. పాడిందెవరో తెలుసా?

‘ది వారియర్‌’లోని ఉర్రూతలూగించే ‘బుల్లెట్టు’ పాట విడుదలైంది. రామ్‌, కృతి శెట్టి డ్యాన్స్‌ ఆకట్టుకునేలా ఉంది.

Updated : 07 Dec 2022 20:45 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేస్తా పా’ అంటూ గాయని మోహన భోగరాజు సంగీత అభిమానుల్ని ఓ ఊపు ఊపింది. ‘బంగార్రాజు’ సినిమాలోని ‘బంగారా బంగారా.. బుల్లెట్టెక్కి వచ్చేయ్‌రా’ పాటతో మధుప్రియ విశేషంగా అలరించింది. అలా ‘బుల్లెట్టు బండి’ ఇటీవల ఓ ట్రెండ్‌ సెట్‌ చేసింది. తాజాగా మరో ‘బుల్లెట్టు’ దూసుకొచ్చి, ఉర్రూతలూగిస్తోంది. ఈ పాటను పాడిందెవరో కాదు తమిళ ప్రముఖ నటుడు శింబు. ఈయన గతంలోనూ కొన్ని తెలుగు పాటలు పాడి అలరించాడు. ఈ పాటలోనూ తనదైన మార్క్‌ ‘విని’పించాడు. ‘కమాన్‌ బేబీ లెట్స్‌ గో ఆన్‌ ది బుల్లెట్టు’ అంటూ సాగే ఈ సాంగ్‌కు శింబుతో గాయని హరిప్రియ శ్రుతి కలిపింది. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం, శ్రీమణి సాహిత్యం, రామ్‌- కృతి డ్యాన్స్‌ అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి.

రామ్, కృతిశెట్టి జంటగా దర్శకుడు లింగుస్వామి తెరకెక్కిస్తున్న ‘ది వారియర్‌’ చిత్రంలోని గీతమిది. ఇందులో రామ్‌.. శక్తిమంతమైన పోలీసు అధికారిగా కనిపించనున్నాడు. యాక్షన్‌ నేపథ్యంలో సాగే ఈ ప్రాజెక్టును శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని జులై 14న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలోనే ‘బుల్లెట్‌’ పాటతో ప్రచారాన్ని ప్రారంభించారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా విడుదలకానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని